DC vs GG : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) బిగ్ వికెట్ కోల్పోయింది. షఫాలీ వర్మ (8) బౌల్డ్ అయింది. తనూజ కన్వర్ ఓవర్లో రెండో బంతిని షఫాలీ లాంగాఫ్‌లో సిక్స్ కొట్టింది. ఐదోబంతికి షాట్ ఆడబోయింది. కానీ, బంతి షూకు తగిలి వికెట్లను గిరాటేసింది. దాంతో, 10 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మేగ్ లానింగ్, అలిసే క్యాప్సే క్రీజులో ఉన్నారు. కిమ్ గార్త్ వేసిన తొలి బంతికే లానింగ్ ఎల్బీ కోసం అప్పీలు చేశారు. రివ్యూలో నాటౌట్‌గా తేలడంతో ఆమె బతికిపోయింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. ఓపెనర్ లారా వోల్వార్డ్త్(57), అష్ గార్డ్నర్ (51) అర్ధ శతకాలతో రాణించారు. వీళ్లు దూకుడుగా ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన వీళ్లిద్దరూ మూడో వికెట్‌కు 81 రన్స్ జోడించారు.