హొబర్ట్: భారత యువ ఓపెనర్ షఫాలీ వర్మ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సత్తాచాటింది. సిడ్నీ సిక్సర్స్ తరఫున బరిలోకి దిగిన షఫాలీ (57; 6 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఫలితంగా హొబర్ట్ హరికేన్స్‌తో జరిగిన పోరులో సిడ్నీ సిక్సర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట హరికేన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆ జట్టు తరఫున భారత ప్లేయర్ రిచా ఘోష్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సిక్సర్స్ బౌలర్లలో రాధ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో షఫాలీ మెరుపులు మెరిపించడంతో 19.3 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ 5 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. షఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.