ఫార్ములా వన్ వరల్డ్ చాంపియన్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు

లండన్: ఏడుసార్లు ఫార్ములా వన్ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్‌పై సోషల్ మీడియాలో కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అతని మెర్సిడీజ్ టీమ్, ఎఫ్ఐఏ ఒక ప్రకటనలో వెల్లడించాయి. ఆదివారం బ్రిటిష్ గ్రాండ్ ప్రి జరుగుతున్న సమయంలో, పూర్తయిన తర్వాత కూడా ఇవి కొనసాగినట్లు తెలిపాయి. ఈ రేసును హామిల్టన్ వివాదాస్పద రీతిలో గెలిచాడు. రేసు మొదట్లోనే చాంపియన్‌షిప్ టేబుల్లో టాప్‌లో ఉన్న రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కారు గోడకు ఢీకొట్టడం, అతడు రేసు నుంచి తప్పుకోవడానికి హామిల్టన్ కారణమయ్యాడు. దీంతో అతనికి 10 సెకన్ల పెనాల్టీ విధించారు.
అయినా చివరికి హామిల్టనే రేసు గెలిచి చాంపియన్‌షిప్ టేబుల్లో వెర్‌స్టాపెన్‌కు కేవలం 8 పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే హామిల్టన్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కొందరు.. రేసు జరుగుతుండగానే జాత్యంహకార వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలను మెర్సిడీజ్ టీమ్ తీవ్రంగా ఖండించింది. బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేసింది. అటు వెర్స్టాపెన్ మాత్రం హామిల్టన్‌పై మండిపడ్డాడు. అతడు క్రీడాస్ఫూర్తి ప్రదర్శించలేదని విమర్శించాడు. ఈ మధ్యే యూరో ఫైనల్లో ఇంగ్లండ్ ఓడిన తర్వాత జాతి వివక్షకు గురైన ముగ్గురు ప్లేయర్స్‌కు మద్దతుగా హామిల్టన్ నిలబడ్డాడు. ఇప్పుడు అతడే వాటికి బాధితుడయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

