Dejana Radanovic | ముంబై: సెర్బియా టెన్నిస్ స్టార్ డెజనా రడనోవిచ్ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కింది. బెంగళూరు, పుణె, ఇండోర్, ముంబైలో జరిగిన ఐటీఎఫ్ టోర్నీల్లో ఆడేందుకు వచ్చిన రడనోవిచ్.. భారత్ కంపుకొడుతుందంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. భారత్‌లో ఆహారం, ట్రాఫిక్, అపరిశుభ్రతపై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.
రడనోవిచ్ జాత్యాంహకర వ్యాఖ్యలపై పులువురు భగ్గుమంటున్నారు. భారత్‌ను ద్వేషిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదంటూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తాను అలా అనలేదంటూ రడనోవిచ్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.