Asia Cup 2023 : పాకిస్థాన్ జట్టు ఆసియా కప్(Asia Cup 2023) స్క్వాడ్‌లో మార్పులు చేసింది. విధ్వంసక ఆటగాడు సాద్ షకీల్(Saud Shakeel)కు చోటిచ్చింది. శ్రీలంక గడ్డపై జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, సెలెక్టర్లు అతడివైపు మొగ్గు చూపారు. మిడిలార్డర్లో పరుగుల వరద పారించగల షకీల్ రాకతో పాక్ బ్యాటింగ్ విభాగం పటిష్టం కానుంది.
రిజర్వ్ ఆటగాడిగా తయ్యబ్ తహిర్(Tayyab Tahir) జట్టులోకి వచ్చాడు. అఫ్గనిస్థాన్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైన 17మందిలో షకీల్ ఒకడు. ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో పాక్, నేపాల్ జట్టును ఢీ కొట్టనుంది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ పోటీలకు శ్రీలంక, పాక్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
Saud Shakeel added in Pakistan’s squad for Asia Cup
Read more ➡️ https://t.co/LNe5k5NCjE#AsiaCup2023
— PCB Media (@TheRealPCBMedia) August 26, 2023
పాక్ స్క్వాడ్ : బాబర్ ఆజాం(కెప్టెన్), అబ్దుల్లా షఫిక్, ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, రిజ్వాన్, హ్యారిస్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, ఉసమా మిర్, ఫహీం అష్రఫ్, హ్యారిస్ రౌఫ్, మహమ్మద్ వసీం జూనియర్, నసీం షా, షాహీన్ ఆఫ్రీదీ, సాద్ షకీల్, తయ్యబ్ తహిర్.