Rinku Singh | ఐర్లాండ్ నుంచి వస్తూ.. అమ్మానాన్నకు అమూల్యమైన గిఫ్ట్ తెచ్చిన సిక్సర్ల కింగ్
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) ఎట్టకేలకు భారత జట్టుకు ఆడాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్( Ireland Series)లో మొదటిసారి టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకున్న ఈ సిక్సర్ల కింగ్ ఎంత మురిసిపోయాడో చూశాం. అదే సంతోషాన్ని అతను తన తల్లిదండ్రులు కంచంద్ర సింగ్(Khanchandra Singh), వీణా దేవీ(Vina Devi)ల ముఖంలో....
Rinku Singh : ఐపీఎల్ హీరో రింకూ సింగ్(Rinku Singh) ఎట్టకేలకు భారత జట్టుకు ఆడాలన్న కల నెరవేర్చుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్( Ireland Series)లో మొదటిసారి టీమిండియా జెర్సీ(Team India Jersey) వేసుకున్న ఈ సిక్సర్ల కింగ్ ఎంత మురిసిపోయాడో చూశాం. అదే సంతోషాన్ని అతను తన తల్లిదండ్రులు కంచంద్ర సింగ్(Khanchandra Singh), వీణా దేవీ(Vina Devi)ల ముఖంలో చూడాలనుకున్నాడు. అందుకని ఐర్లాండ్ నుంచి వస్తూ వాళ్ల కోసం అమూల్యమైన బహుమతి తెచ్చాడు. ఇంతకు ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..? భారత జట్టు జెర్సీ.
కొడుకు ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన ఆ జెర్సీలను ధరించిన వాళ్ల ఆనందానికి అవధులు లేవనుకో. టీమిండియా జెర్సీలో ఉన్న అమ్మనాన్నతో రింకూ ఫొటో దిగాడు. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దానికి ‘వీళ్లిద్దరి వల్లనే నా క్రికెటర్‌గా నా ప్రయాణం మొదలైంది’ అని క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్ అవుతోంది.
ఐర్లాండ్ సిరీస్‌లో రింకూ ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో 21 బంతుల్లోనే 38 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దాంతో, అరంగేట్రం సిరీస్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఐర్లాండ్ సిరీస్ ఉత్సాహంతో రింకూ ఆసియా గేమ్స్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ పోటీల కోసం రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) సారథ్యంలోని యువ భారత్ త్వరలోనే చైనాకు వెళ్లనుంది.
ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో…
పేదింట్లో పుట్టిన రింకూ సింగ్ క్రికెటర్ అయ్యేందుకు ఎంతో కష్టపడ్డాడు. కొన్నాళ్లు హోటళ్లలో పనిచేశాడు. రింకూ నాన్న కంచంద్ర సింగ్ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు వేస్తూ కొడుకు కలకు అండగా నిలిచాడు. దేశవాళీలో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన రింకూ ఐపీఎల్‌తో హీరో అయ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్లో ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. గుజరాత్ టైటన్స్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ఓవర్లో 5 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు.
రింకూ సింగ్

ఆ తర్వాత పలు మ్యాచుల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.ఆసియా గేమ్స్‌తో పాటు ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. దాంతో, ఇన్నేళ్ల తన కష్టానికి ఫలితం దొరికిందని తెగ సంబరపడిపోయాడు. అలాగని అతను తన పాత రోజుల్ని మర్చిపోలేదు. తనలాంటి పేద పిల్లలకు క్రికెట్లో శిక్షణ ఇవ్వడం కోసం ఒక హాస్టల్ కట్టిస్తున్నాడు. అందులోనే భోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
Asia Cup | ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వార్నింగ్..!
Carlos Alcaraz | మునపటి కంటే ఎంతో మెరుగయ్యా.. అతడు చాలా కఠినమైన ప్రత్యర్థి : అల్కరాజ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

