Carlos Alcaraz | మునపటి కంటే ఎంతో మెరుగయ్యా.. అతడు చాలా కఠినమైన ప్రత్యర్థి : అల్కరాజ్
Carlos Alcaraz : వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ఈ ఏడాది వింబుల్డన్ ట్రోఫీ(Wimbledon Trophy) గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈసారి యూఎస్ ఓపెన్ టోర్నీ(US Open 2023)లో అతను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. వరుసగా రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌పై గురి పెట్టిన ఈ యువ సంచలనం తాజాగా...
Carlos Alcaraz : వరల్డ్ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ఈ ఏడాది వింబుల్డన్ ట్రోఫీ(Wimbledon Trophy) గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈసారి యూఎస్ ఓపెన్ టోర్నీ(US Open 2023)లో అతను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. వరుసగా రెండో యూఎస్ ఓపెన్ టైటిల్‌పై గురి పెట్టిన ఈ యువ సంచలనం తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రీ- టోర్నమెంట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిరుడు కంటే ఎంతో మెరుగయ్యానని, ఒత్తిడిలో ఎలా ఆడాలో నేర్చుకున్నానని అన్నాడు.
‘మునపటి కంటే చురుగ్గా కోర్టులో కదులుతున్నా. గత ఏడాది కంటే ఇప్పుడు నేను ఉత్తమ ఆటగాడిని. నిరుడు ఇక్కడే మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచాను. అప్పుడు ట్రోఫీ గెలవడం కోసం ఏం చేశానో ఇప్పుడు కూడా అదే చేస్తాను. అప్పటిలాగనే ప్రాక్టీస్ చేస్తాను. డిఫెండింగ్ చాంపియన్ అనే ట్యాగ్‌ను పట్టించుకోవడం లేదు. నా అత్యుత్తమ ఆటను కనబరిచేందుకు ప్రయత్నిస్తా. ప్రతి గేమ్‌లో మరింత గొప్పగా ఆడేందుకు కృషి చేస్తాను. అవన్నీ సరేగానీ.. ఈసారి టోర్నమెంట్ ఎలా జరుగుతుందో చూద్దాం’ అని అల్కరాజ్ వెల్లడించాడు. అంతేకాదు బలమైన ప్రత్యర్థి అయిన నొవాక్ జకోవిచ్(Novac Djokovic) గురించి కూడా మాట్లాడాడు. ‘జకోవిచ్ ఒక పోరాట యోధుడు. అతడు ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోడు. అందుకని అతడిపై గెలుపొందడం చాలా కష్టం’ అని వరల్డ్ నంబర్ 1 చెప్పుకొచ్చాడు.
సిన్సినాటి ఓపెన్ రన్నరప్ అల్కరాజ్, జకోవిచ్

వింబుల్డన్ ఫైనల్లో అల్కరాజ్ అద్భుత విజయం సాధించాడు. జకోవిచ్‌కు చెమటలు పట్టించిన ఈ స్పెయిన్ స్టార్ మొదటిసారి రొలాండ్ గరోస్ చాంపియన్‌గా నిలిచాడు. జకో, అల్కరాజ్ ఈమధ్యే సిన్సినాటి ఓపెన్(cincinnati open)లో ఆడారు. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో జకో వరల్డ్ నంబర్ 1 అల్కరాజ్కు షాకిచ్చాడు. దాంతో, యూఎస్ ఓపెన్‌లో ఎవరు పై చేయి సాధిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
PAK vs AFG | బాబర్, రిజ్వాన్ హాఫ్ సెంచరీ.. అఫ్గనిస్థాన్ ముందు భారీ లక్ష్యం
ODI WC 2023 | వరల్డ్ కప్ టికెట్లకు పోటెత్తిన ఫ్యాన్స్.. మొదటి రోజే మొరాయించిన యాప్, వెబ్సైట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

