ఫైనల్లో సాత్విక్-చిరాగ్
భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-16, 18-21, 21-11తో మలేషియాకు చెందిన నూర్ అయుబ్ - తాన్ వీ కియోంగ్ జంటను ఓడించింది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జంట అద్భుతమైన వ్యూహాత్మక ఆటతీరుతో అలరించింది.
షెన్జెన్ (చైనా): భారత డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నమెంట్లో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 21-16, 18-21, 21-11తో మలేషియాకు చెందిన నూర్ అయుబ్ – తాన్ వీ కియోంగ్ జంటను ఓడించింది. గంటా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో భారత జంట అద్భుతమైన వ్యూహాత్మక ఆటతీరుతో అలరించింది.
ఈ విజయంతో సాత్విక్-చిరాగ్ గత నాలుగేండ్లలో మూడోసారి (2023, 25, 26) ఈ టోర్నీ ఫైనల్‌కు చేరింది. సెమీస్ తొలి గేమ్‌ను 0-5తో ఆరంభించిన భారత జోడీ వెంటనే తేరుకుంది. ఏకాగ్రత కోల్పోకుండా వరుసగా ఏడు పాయింట్లు సాధించి 7-5తో ఆధిక్యంలోకి వచ్చిన సాత్విక్-చిరాగ్ తర్వాత ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను సులువుగా ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్ కోల్పోయినా నిర్ణయాత్వక మూడో గేమ్‌లో భారత షట్లర్లు బలమైన స్మాష్‌లతో పాటు నెట్ గేమ్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు. ఆదివారం జరిగే ఫైనల్లో భారత జోడీ చైనాకు చెందిన హే జి టింగ్-రెన్ జియాంగ్ యు ద్వయంతో పోటీ పడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

