Singapore Open : సింగపూర్ ఓపెన్‌లో భారత్‌కు శుక్రవారం మిశ్రమ ఫలితాయి ఎదురయ్యాయి. డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్(Satwik Sairaj) – చిరాగ్ శెట్టి(Chirag Shetty)ద్వయం క్వార్టర్ ఫైనల్లో అదిరే విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే.. మహిళల సింగిల్స్‌లో పతకం గెలుస్తుందనుకున్న పీవీ సింధు (PV Sindhu) అనూహ్యంగా ఓటమితో ఇంటిదారి పట్టింది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 1 చేతిలో సింధు కంగుతిన్నది.
ఈ సీజన్లో అదరగొడుతున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం సింగపూర్ ఓపెన్ టైటిల్ వేటలో దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జంట కాంగ్ ఖాయ్ గ్జింగ్ – అరోన్ తాయ్ (మలేషియా) జోడీని చిత్తు చేసింది. తొలిసెట్‌ను 19-21తో కోల్పోయిన సాత్విక్ – చిరాగ్ రెండో సెట్లో పుంజుకొని ప్రత్యర్థికి షాకిచ్చారు. 21-17తో సెట్‌ను కైవసం చేసుకొని.. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ మలేషియా ద్వయానికి సాత్విక్ – చిరాగ్ ఏమాత్రం అవకాశమివ్వలేదు.
SatChi Into Semis ✅️
After a grueling 65 minute battle , Satwik/Chirag took sweet revenge against Malaysia’s Aaron/Kang .
SF : 🇮🇳 SatChi vs SeoKim 🇰🇷#SingaporeOpen2026 https://t.co/C8rmHcizaO pic.twitter.com/2eRN5H2YKU
— Badminton Media (@BadmintonMedia1) May 29, 2026
అంతకుముందు మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో పీవీ సింధుకు నంబర్ 1 అన్ సే యాంగ్(దక్షిణ కొరియా) చెక్ పెట్టింది. తొలి సెట్లో అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్న సింధుకు యాంగ్ షాకిచ్చింది. 17-21తో కోల్పోయిన తెలుగు తేజం రెండో సెట్లోనూ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. ఫలితంగా యాంగ్ 21-14తో పైచేయి సాధించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది.
PV Sindhu Into The Quarters Of The BWF Singapore Open 2026 💥
Sindhu Defeated Japanese Shuttler Riko Gunji In Straight Games 21-9 , 21-12
QF Against An Se Young 🇰🇷PV SINDHU WILL BE BACK IN TOP 10 NEXT WEEK ❤️#SingaporeOpen2026 https://t.co/8zOfD3QD4b pic.twitter.com/tmRz4GWISQ
— Badminton Media (@BadmintonMedia1) May 28, 2026