Sarfaraz Khan : ముంబై రంజీ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఈమధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు అతడిని ఎంపిక చేయకపోవడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. దాంతో, అతని గురించి సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే.. ఈసారి అతను తండ్రి నౌషధ్ ఖాన్‌తో గతంలో చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. తెలిసీతెలియని వయసులో సర్ఫరాజ్ తనతో చెప్పిన మాటల్ని నౌషధ్ గుర్తు చేసుకున్నాడు. ‘అబ్బూ.. అర్జున్ టెండూల్కర్ ఎంత అదృష్టవంతుడు? అతను సచిన్ కుమారుడు. అతని దగ్గర కార్లు, ఐపాడ్స్.. ప్రతి ఒక్కటి ఉన్నాయి’ అని సర్ఫరాజ్ తనతో తండ్రితో అన్నాడట. కొడుకు అలా మాట్లాడే సరికి నౌషధ్ నోట మాట రాలేదట. అయితే.. ఆ కాసేపటికే సర్ఫరాజ్ పరుగెత్తుతూ వచ్చి తనను హత్తుకొని.. ‘అయినా కూడా అతడి కంటే నేనే అదృష్టవంతుడిని. నువ్వు రోజంతా నాతో ఉంటావు. కానీ, అతని తండ్రి సమయం కేటాయించలేడు’ అని చెప్పాడట. తన కుమారుడి అమాయకత్వాన్ని తలచుకుని నౌషధ్ కన్నీళ్లు పెట్టకున్నాడట.
తండ్రి కష్టం వృథా చేయకుండా..
కెరీర్ తొలినాళ్లలో సర్ఫరాజ్, అర్జున్‌తో కలిసి ఆడాడు. అతడితో తన జీవితాన్ని పోల్చుకునేవాడు. ఎందుకంటే.. సర్ఫరాజ్ తండ్రి అతడిని క్రికటెర్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. తన చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించడంతో పాటు కొడుకు ఖర్చులు తీర్చేందుకు నానా ఇబ్బందులు పడ్డాడు. తండ్రి కష్టాన్ని వృథా చేయకుండా క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. రంజీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. గత రెండు సీజనల్లో అతను వరుసగా 900లకు పైగా రన్స్ చేశాడు. దాంతో, ఈసారి టీమిండియాకు ఆడతానని అనుకున్నాడు. కానీ, ఆస్ట్రేలియా సిరీస్ తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన 17మందిలో అతడి పేరు లేదు. దాంతో, తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వెంకటేశ్ ప్రసాద్ వంటి కొందరు సర్ఫరాజ్‌కు దన్నుగా నిలిచారు.
Sarfaraz Khan’s father Nausad Khan narrates a heartwarming story involving his son and Arjun Tendulkar during childhood.#SarfarazKhan #ArjunTendulkar #RanjiTrophy pic.twitter.com/a15vrZyngB
— CricTracker (@Cricketracker) January 22, 2023