దుబాయ్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. భర్త షోయెబ్ మాలిక్‌కు .. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసా జారీ చేసింది. గోల్డెన్ వీసా పదేళ్లు పనిచేస్తుంది. సానియా-షోయెబ్లు 2010లో పెళ్లి చేసుకున్నారు. అయితే చాన్నాళ్ల నుంచి దుబాయ్‌లోనే వాళ్లు ఉంటున్నారు. 2019లో యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలం రెసిడెన్స్ వీసా ఇస్తారు. ఈ వీసా ఉన్న విదేశీయులు.. యూఏఈలోనే పనిచేసుకునే వీలు ఉంటుంది. వ్యాపారవేత్తలు, ప్రొఫెషనల్స్, సైన్సు లాంటి అంశాల్లో ప్రత్యేక ట్యాలెంట్ ఉన్నవారికి ఈ వీసా ఇవ్వనున్నారు. పదేళ్ల కాల వ్యవధి తర్వాత ఆటోమెటిక్‌గా గోల్డెన్ వీసాను రెన్యూవల్ చేస్తారు. గతంలో గోల్డెన్ వీసా దక్కించుకున్న క్రీడాకారుల్లో క్రిస్టియానో రోనాల్డో, లూయిస్ ఫిగో, నోవాక్ జోకోవిచ్‌లు ఉన్నారు. షారూక్ ఖాన్, సంజయ్ దత్‌లకు కూడా ఈ వీసాలు ఉన్నాయి.