DC vs CSK | శాంసన్ శతకమోత.. రెండొందలు కొట్టిన చెన్నై..!
DC vs CSK ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. మూడు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్(115 నాటౌట్) సెంచరీతో కదంతొక్కగా.. ఈసీజన్లో తొలిసారి సీఎస్కే రెండొందలు బాదేసింది.
DC vs CSK ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. మూడు మ్యాచుల్లో దారుణంగా విఫలమైన సంజూ శాంసన్(115 నాటౌట్) సెంచరీతో కదంతొక్కగా.. ఈసీజన్లో తొలిసారి సీఎస్కే రెండొందలు బాదేసింది. ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సంజూ.. ఆయుశ్ మాత్రే(59)తో కలిసి స్కోర్ బోర్డును ఉరికించాడు. రెండో వికెట్‌కు శతక భాగస్వామ్యంతో ఢిల్లీని విసిగించారిద్దరూ. ఆఖర్లో్ శివం దూబే(20 నాటౌట్) తన మార్క్ విధ్వంసం కొనసాగించగా చెన్నై నిర్ణీత ఓవర్లలో 212 పరగులు చేసింది.
డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లోనూ రెండొందలకు పైగా స్కోర్ నమోదైంది. టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ శాంసన్(115 నాటౌట్) భారీ స్కోరందించాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(15)తో కలిసి సంజూ శుభారంభమివ్వగా పవర్ ప్లేలో చెన్నై 61 పరుగు చేసింది. క్రీజునంటున్న ఈ జోడీని విడదీసిన అక్షర్ పటేల్ ఢిల్లీకి తొలి వికెట్ అందించాడు. గైక్వాడ్ ఔటయ్యాక ఆయుశ్ మాత్రే(59)తో సీఎస్కే స్కోర్ బోర్డును ఉరికించాడు సంజూ.
📸📸
A 𝙎𝙖𝙣𝙟𝙪 𝙎𝙖𝙢𝙨𝙤𝙣 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 in Chennai 🫡💯
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC pic.twitter.com/u2TWFHmNYj
— IndianPremierLeague (@IPL) April 11, 2026
ముకేశ్ ఓవర్లో సింగిల్‌తో సీఎస్కే తరఫున శాంసన్ మొట్టమొదటి అర్ధ శతకం సాధించాడు. 26 బంతుల్లో 9 ఫోర్లతో యాభై కొట్టిన సంజూ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న మాత్రే తన స్టయిల్ విధ్వంసం కొనసాగించాడు. వీరిద్దరి దూకుడుతో చెన్నై స్కోర్ వేగం పుంజుకుంది. అర్ధ శతకం బాదిన మాత్రే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.. శివం దూబే(20 నాటౌట్) డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడాడు. నటరాజన్ ఓవర్లో ఫోర్‌తో సంజూ ఐపీఎల్లో నాలుగో సెంచరీ సాధించాడు.
ముకేశ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 15 పరుగులు రాబట్టగా సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 212 రన్స్ కొట్టింది.
5⃣9⃣(36) 🔥🔥
Another top knock from Ayush Mhatre to set up the #CSK innings 👏👏
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC pic.twitter.com/cPJtxSupGR
— IndianPremierLeague (@IPL) April 11, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

