CSK vs KKR : పంతొమ్మిదో సీజన్లో వరసగా రెండో విజయంపై కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోర్ కొట్టింది. సొంత మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికేస్తూ సంజూ శాంసన్(48), డెవాల్డ్ బ్రెవిస్(41)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆయుశ్ మాత్రే(38) మెరవగా.. మిడిల్ ఓవర్లలో సర్ఫరాజ్ ఖాన్(23) దంచేశాడు. అయితే.. డెత్ ఓవర్లలో శివం దూబే(13 నాటౌట్) బ్యాటు ఝులిపించకపోవడంతో చెన్నై 192కే పరిమితమైంది.
టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో సంజూ శాంసన్(48) హ్యాట్రిక్ ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటాడు. అయితే.. ఫామ్‌లో లేని రుతురాజ్ గైక్వాడ్(7)ను అనుకుల్ రాయ్ చేసి బ్రేకిచ్చాడు. శాంసన్ జతగా ఆయుష్ మాత్రే(38) దూకుడుగా ఆడాడు. నాలుగో ఓవర్లో 4, 4, 6, 6తో ఇరవై రన్స్ పిండుకున్నాడు మాత్రే. రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించిన మాత్రేను వైభవ్ అరోరా ఔట్ చేసి రెండో వికెట్ అందించాడు.
.@ChennaiIPL and @KKRiders are wearing black armbands as a mark of respect to former India cricketer C.D. Gopinath, who breathed his last on April 9.#TATAIPL | #CSKvKKR pic.twitter.com/Zv9NxNjAp6
— IndianPremierLeague (@IPL) April 14, 2026
ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్(23) జతగా రెచ్చిపోయిన సంజూను కార్తిక్ త్యాగీ బౌల్డ్ చేశాడు. 111కే మూడు వికెట్లు పడిన వేళ.. కోల్‌కతా బౌలర్లపై డెవాల్డ్ బ్రెవిస్ (41), సర్ఫరాజ్ ఎదురుదాడికి దిగారు. నరైన్ ఓవర్లో సర్ఫరాజ్ బౌల్డవ్వగా.. అర్ధ శతకానికి చేరువైన బ్రెవిస్‌ను కార్తిక్ త్యాగి వెనక్కి పంపాడు. డెత్ ఓవర్లలో ఓవర్టన్(7 నాటౌట్), శివం దూబే(13 నాటౌట్)లు ధనాధన్ ఆడలేకపోవడంతో 200లు కొట్టాలనుకున్న చెన్నై 192కే పరిమితమైంది.