హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి-తీర్థ శశాంక్ జోడీ ఐటీఎఫ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. చెన్నై వేదికగా జరిగిన ఐటీఎఫ్ 15కే టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో కార్తీక్-తీర్థ శశాంక్ జంట 6-1, 6-7 (7/2), 7-10తో విష్ణువర్ధన్-నితిన్ కుమార్ జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న కార్తీక్.. ద్వయం రెండో సెట్లో హోరాహోరీగా పోరాడి ఓడింది. ఇక నిర్ణయాత్మక టైబ్రేక్ లో కార్తీక్ జంట తుదికం టా పోరాడినా పరాజయం తప్పలేదు.