Sachin Tendulkar : భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) డీప్ఫైక్ వీడియో (Deepfake Video) కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. ఇంటర్నెట్ ప్రొటోకాల్ (IP address) ఆధారంగా ఎక్కడి నుంచి అప్లోడ్ అయిందో కనిపెట్టారు. మాస్టర్ బ్లాస్టర్ డీప్‌ఫేక్ వీడియోను ఫిలీప్పీన్స్ (philippines) నుంచి పోస్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోను హాట్ మెయిల్ ద్వారా అప్లోడ్ చేశారని తెలిపారు.
‘సచిన్ డీప్‌ఫేక్ వీడియో మీద సాంకేతిక దర్యాప్తు చేయగా.. ఫిలీప్పీన్స్ దేశంలోని ఐపీ అడ్రస్‌తో అప్లోడ్ చేసినట్టు తేలింది. అయితే.. ప్రైవేట్ నెట్వర్క్(Virutal Private Network) సాయంతో కచ్చితమైన లొకేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని పోలీసులు వెల్లడించారు.
ఆ వీడియోలో సచిన్ తన కూతురు సారా టెండూల్కర్(Sara Tendulkar) ఒక గేమింగ్ యాప్ ద్వారా చాలా డబ్బులు సంపాదించింది అని చెప్పినట్టు చూపించారు. దాంతో, సచిన్ అదొక ఫేక్ వీడియో అని, నిందితులపై చర్యలు తీసకోవాలని పోలీసులను ఎక్స్ ఖాతా వేదికగా కోరాడు.
These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.
Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM
— Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024
‘అదొక ఫేర్ వీడియో. కొందరు టెక్నాలజీ దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఈ వీడియో ఒక సాక్ష్యం. ఇలాంటి వీడియోలు, యాప్స్.. వంటివి ఏవైనా మీ కంటపడితే వెంటనే పోలీసులకు తెలియజేయండి. సోషల్ మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తల పట్ల అప్రతమ్తంగా ఉండాలి. ఇలాంటివి జనంలోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి’ అని తన పోస్ట్‌లో సచిన్ రాసుకొచ్చాడు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Inteligence) టెక్నాలజీ సాయంతో కొందరు డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ల టార్గెట్ సెలబ్రిటేలే. కొన్ని రోజుల క్రితం కన్నడ నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna)పై కూడా ఒక డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. అయితే.. విచరాణ చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.