Sachin Tendulkar : భారత క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆటను దిగ్గజ ఆటగాళ్లు వేనోళ్ల పొగుడుతున్నారు. ఐపీఎల్ 19లో వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌లు చూసి అతడు నా ఫేవరెట్ క్రికెటర్ అని ప్యాట్ కమిన్స్.. ప్రస్తుతం ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాళ్లలో వైభవ్ ఒకడు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చెప్పేశారు. పదిహేనేళ్లకే దునియా మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ కుర్రాడికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రశంసలూ దక్కాయి. వైభవ్ చాలా ప్రత్యేకమని, అతడి మణికట్టు మ్యాజిక్ అద్భుతమైని సచిన్ పేర్కొన్నాడు.
ప్రపంచ క్రికెట్లో వంద శతకాలతో చరిత్ర సృష్టించిన సచిన్ టెండూల్కర్ ఐపీఎల్లో దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తేశాడు. క్రిక్ఇన్ఫో 21వ శతాబ్దపు ఉత్తమ పురుష క్రికెటర్ అవార్డుకు ఎంపికైన సచిన్ మాట్లాడుతూ వైభవ్ చాలా ప్రత్యేకమైన క్రికెటర్ అని చెప్పాడు. వైభవ్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. సహజసిద్ధంగా అతడికి అబ్బిన క్రికెట్ నైపుణ్యాలతో ఎవరూ పోటీపడలేరు. ప్రతిఒక్కరూ సూర్యవంశీ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ, నేను అతడి ఆటను గమనిస్తున్నా. ఎంతో గొప్పగా ఆడుతున్నాడు.
Sachin Tendulkar said that the most fascinating aspect of Vaibhav Sooryavanshi’s batting is his wrist work.
According to Tendulkar, Sooryavanshi is not merely slogging the ball; he is picking the line and length earlier than most other players. pic.twitter.com/ymP8chW8Px
— Cricketopia (@CricketopiaCom) May 30, 2026
అతడు బంతిని బాదే సామర్ధ్యం మాత్రమే కాదు అతడు మణికట్టును కదిలించే తీరు అద్భుతం. మైదానం నలువైపులా షాట్లు ఆడాలంటే మణికట్టును మెరుపులా కదలించడం కీలకం. వైభవ్ బంతిని బాదడం కాదు.. లైన్ అండ్ లెంగ్త్‌ను అందరికంటే ముందే పసిగడుతున్నాడు. దాంతో, అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపుతున్నాడు అని వైభవ్ ఆటను విశ్లేషించిన సచిన్ అతడిని టెస్టుల్లో చూడాలని ఆశపడుతున్నట్టు చెప్పాడు.

‘వైభవ్‌ను నేను టెస్టు జెర్సీలో చూడాలనుకుంటున్నా. అలా అనీ తొందరేమీ లేదు. వైభవ్‌ను అతడిలానే ఉండాలని నేను కోరుతున్నా. అయితే.. టెస్టు్ల్లో అతడు సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్చుకుంటాడు. వైభవ్ చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తాడు. టెస్టుల్లో బౌలర్లు విసిరే సవాళ్లకు అతడు ఎలా స్పందిస్తాడో చూడాలనుంది. అంతేతప్ప నేను అతడి సహజ నైపుణ్యాలను తక్కువ చేయడం లేదు. ప్రస్తుతానికి బంతిని సునిశితంగా గమనించి బాదేస్తున్న వైభవ్.. ఆ సిగ్నల్‌లో అంతరాయం ఏర్పడితే కష్టాలు తప్పవు. అప్పుడు అతడికి నిజమైన సవాళ్లు ఎదురవుతాయి.

అందుకని అతడిని ఇప్పటిలానే స్వేచ్ఛగా కోరుతున్నా. కాలంలో పాటు అతడు ఆటలోని సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్చుకుంటాడు. టెస్టులే కాదు ఏ ఫార్మాట్లో వైబవ్ గొప్పగా ఆడుతాడో అందులోనే కొనసాగించాలి. ఈ విషయాన్ని సెలెక్టర్లకు వదిలేస్తున్నా. ఎందుకంటే ప్రతిభావంతుడైన సూర్యవంశీ భవిష్యత్తుకు వారిదే బాధ్యత’ అని టెండూల్కర్ వెల్లడించాడు.
పంతొమ్మిదో సీజన్లో ఆరెంజ్ క్యాప్ విజేత ఎవరు? అనేది ఆసక్తి రేపుతోంది. ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లో శతకం చేజార్చుకున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ అతడికి గట్టి పోటీ ఇస్తున్నారు. రాజస్థాన్‌పై సెంచరీతో గిల్ ఏడొందల క్లబ్లో చేరగా.. అర్ధ శతకంతో మెరిసిన సుదర్శన్ సైతం రేసులోకి దూసుకొచ్చాడు.