Diamond Duck | టీ20ల్లో డైమండ్ డక్.. మూడో భారత క్రికెటర్‌గా రుతురాజ్
Diamond Duck : క్రికెట్‌ను బాగా ఫాలో అయ్యే అభిమానులకు కొన్ని పదాలు సుపరిచతమే. డీఆర్ఎస్(DRS), కంకషన్ సబ్‌స్టిట్యూట్.. గోల్డెన్ డక్(Golden Duck) వంటివి చాలామందికి తెలుసు. అయితే.. విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Rutraj Gaikwad) అనూహ్యరీతిలో...
Diamond Duck : క్రికెట్‌ను బాగా ఫాలో అయ్యే అభిమానులకు కొన్ని పదాలు సుపరిచతమే. డీఆర్ఎస్(DRS), కంకషన్ సబ్‌స్టిట్యూట్.. గోల్డెన్ డక్(Golden Duck) వంటివి చాలామందికి తెలుసు. అయితే.. విశాఖపట్టణంలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) అనూహ్యరీతిలో ఔటయ్యాడు. ఈ స్టార్ ఓపెనర్ డైమండ్ డక్(Diamond Duck)గా వెనుదిరిగాడు. దాంతో, ఈ డైమండ్ డక్ ఏంటీ? అని కొందరు గూగుల్ చేయడం మొదలెట్టారు.
గోల్డెన్ డక్ అంటే ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటవ్వడం. అదే డైమండ్ డక్ అనుకోండి.. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే ఔటవ్వడం. వైజాగ్‌లో రుతురాజ్ అలానే ఔటయ్యాడు. తొలి ఓవర్లో ఐదో బంతికి యశస్వీ రెండు పరుగులు తీయాలనుకున్నాడు. అయితే.. రెండో పరుగు కోసం సగం క్రీజు దాటేశాడు. కానీ, అప్పటికే ఫీల్డర్ బంతిని కీపర్ ఇంగ్లిస్ వైపు త్రో చేయడంతో యశస్వీ.. రన్ వద్దనుకున్నాడు. కానీ, అప్పటికే బంతి అందుకున్న ఇంగ్లిస్ వికెట్లను గిరాటేశాడు. దాంతో, రుతురాజ్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అంతేకాదు టీ20ల్లో డైమండ్ డక్‌గా వెనుదిరిగిన మూడో భారత క్రికెటర్‌గా అతడు రికార్డుకెక్కాడు. అతడికంటే ముందు జస్ప్రీత్ బుమ్రా(2016), అమిత్ మిశ్రా(2017) లు ఈ తరహాలో ఔటయ్యారు.
సూర్యకుమార్ యాదవ్ (80)

వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధలో ఉన్న భారత అభిమానులు వైజాగ్‌లో పరుగుల జాతరను ఎంజాయ్ చేశారు. భారీ స్కోర్లు నమోదైన మయాచ్లో టీమిండియా సూపర్ విక్టరీ కొట్టింది. సూర్యకుమార్ యాదవ్ (80 : 42 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. డాషింగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(58: 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు)తో జట్టును గెలుపు వాకిట నిలిపారు. ఆ తర్వాత రింకూ సింగ్(28 నాటౌట్), టెయిలెండర్లతో కలిసి లాంచనం పూర్తి చేశాడు. దాంతో, భారత్ పొట్టి ఫార్మాట్లో రికార్డు లక్ష్యాన్ని (209 పరుగులు) ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇవి కూడా చదవండి
-
Minister KTR | డీప్‌ఫేక్‌లతో అప్రమత్తంగా ఉండండి.. బీఆర్ఎస్ శ్రేణులకు సూచించిన మంత్రి కేటీఆర్
-
Maheshwaram | జనసంద్రంగా మారిన మహేశ్వరం.. ఫొటో గ్యాలరీ
-
Israel-Hamas War | నేటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ.. బందీల విడుదల ప్రారంభం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

