న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక పారా షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతున్నది. సోమవారం జరిగిన మిక్స్డ్ 50మీటర్ల పిస్టల్(ఎస్హెచ్1) విభాగంలో రుద్రాంశ్ ఖండేల్వాల్ రజత పతకంతో మెరిశాడు. ఇదే విభాగంలో పోటీపడ్డ నిహాల్సింగ్ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే పారిస్ పారాలింపిక్స్ బెర్తు దక్కించుకున్న రుద్రాంశ్ ఫైనల్లో 223.2 స్కోరుతో రెండో స్థానంలో నిలువగా, డేవిడ్ ఫ్రాన్సెట్టి (ఇటలీ) 230 పసిడి ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మిక్స్డ్ 50మీటర్ల పిస్టల్ (ఎస్హెచ్1) టీమ్ ఈవెంట్లో రుద్రాంశ్, నిహాల్సింగ్, సింగ్రాజ్ త్రయం వెండి పతకం దక్కించుకోగా, చైనా బృందం స్వర్ణం సొంతం చేసుకుంది.