లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుతిరిగాడు. ఈ ఐపీఎల్ టోర్నీని గోల్డెన్ డక్‌గా మొదలుపెట్టిన రాహుల్.. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా అదే విధంగా అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రాహుల్.. దాన్ని ఆడలేకపోయాడు. బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి దూసుకెళ్లిన బంతి వికెట్లను కూల్చింది.
దీంతో లక్నో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృష్ణప్ప గౌతమ్ (0) కూడా తొలి బంతికే క్రీజును వీడాడు. బౌల్ట్ వేసిన బంతిని సరిగా ఆడలేకపోయిన అతను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన లక్నో కష్టాల్లో పడింది. ఆ ఒక పరుగు కూడా బౌల్ట్ వేసిన వైడ్ కావడం గమనార్హం.