చెన్నై జట్టుకు మరో షాక్ తగిలింది. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డెవాన్ కాన్వే (16) అవుటయ్యాడు. మొయీన్ అలీ (66 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన అతను.. తను కూడా భారీ షాట్లు ఆడేందుకు సిద్ధమైన తరుణంలోనే అవుటయ్యాడు. అశ్విన్ వేసిన 8వ ఓవర్లో ఫుల్ లెంగ్త్ బాల్‌ను స్వీప్ చేయడానికి ప్రయత్నించిన కాన్వే.. మిస్ అయ్యాడు.
బంతి ప్యాడ్లను తాకడంతో అంపైర్ అవుటిచ్చాడు. కాన్వే వెంటనే రివ్యూ కోరాడు. అయితే రివ్యూలో కూడా ఎలాంటి ఇన్సైడ్ ఎడ్జ్ లేదని తేలడంతో అతను నిరాశగా పెవిలియన్ చేరాడు. దీంతో 85 పరుగుల వద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది. జగదీశన్ క్రీజులోకి వచ్చాడు.