చెన్నై: రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఆర్పీపీఎల్) ఆధ్వర్యంలో ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్ మూడో రౌండ్ పోటీలకు మద్రాస్ ఇంటర్నేషనల్ సర్యూట్ సిద్ధమైంది. శని, ఆదివారాల్లో మూడు రకాల చాంపియన్‌షిప్‌లు జరుగనున్నాయి. ప్రధానంగా ఐఆర్ఎల్ మూడో రౌండ్ రేసులో ఆరు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. తొలి రెండు రౌండ్లలో మూడుసార్లు పోడియం ఫినిష్ చేసిన బెంగాల్ టైగర్స్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నది. ఈ రెండు రోజుల్లో ఐఆర్ఎల్తో పాటు ఫార్ములా-4 ఇండియన్ చాంపియన్‌షిప్, నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్ పోటీలు కూడా జరుగనున్నాయి. మొత్తం ఐదు రౌండ్లలో జరిగే ఇండియన్ రేసింగ్ ఫెస్టివెల్ పోటీలను అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.