క్రిస్టియానోట్రోఫీ లేకుండానే ముగిసిన రొనాల్డో వరల్డ్‌కప్ ప్రస్థానం
సాకర్ సూపర్ స్టార్, పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ పోరాటం నిరాశతో ముగిసింది. కెరీర్లో చివరి వరల్డ్‌కప్ బరిలో నిలిచిన రొనాల్డో.. తన జట్టును క్వార్టర్‌ఫైనల్ కూడా తీసుకెళ్లలేకపోయాడు.
- ప్రిక్వార్టర్స్‌లోనే ఓడిన పోర్చుగల్
- 1-0తో గెలిచి క్వార్టర్స్‌కు స్పెయిన్
అర్లింగ్టన్ (టెక్సాస్): సాకర్ సూపర్ స్టార్, పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ పోరాటం నిరాశతో ముగిసింది. కెరీర్లో చివరి వరల్డ్‌కప్ బరిలో నిలిచిన రొనాల్డో.. తన జట్టును క్వార్టర్‌ఫైనల్ కూడా తీసుకెళ్లలేకపోయాడు. మాజీ చాంపియన్ స్పెయిన్ అడ్డు దాటలేపోయిన పోర్చుగల్ ప్రిక్వార్టర్‌లోనే ఇంటిదారి పట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన పోరులో మికెల్ మెరెనో (90+1వ ని) చేసిన లేట్ గోల్‌తో స్పెయిన్ 1-0తో పోర్చుగల్‌ను ఓడించింది. దాంతో 2010లో ట్రోఫీ నెగ్గిన 16 ఏండ్ల తర్వాత మెగా టోర్నీలో తొలిసారి క్వార్టర్స్ చేరింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో బెల్జియంతో స్పెయిన్ తలపడనుంది.
ఆఖర్లో స్పెయిన్ మ్యాజిక్
రెండు మేటి జట్ల మధ్య పోరు ఆరంభం నుంచే హోరాహోరీగా సాగింది. ఇరు జట్లూ స్వేచ్ఛగా దాడులు చేసినా.. డిఫెన్స్ విభాగాలు బలంగా ఉండటంతో తొలి అర్ధభాగంలో గోల్ రాలేదు. డాని ఓల్మో అందించిన అద్భుతమైన పాస్‌తో గోల్ చేసే సువర్ణావకాశం లభించినా స్పెయిన్ ఆటగాడు ఒయార్జబాల్ బంతిని వైడ్‌గా కొట్టి నిరాశపరిచాడు. ఆ తర్వాత అలెక్స్ బేనా కొట్టిన కర్లింగ్ షాట్‌ను పోర్చుగల్ కీపర్ డియోగో కోస్టా అద్భుతమైన డైవ్‌తో అడ్డుకున్నాడు. మరోవైపు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను ప్రత్యర్థి రక్షణ శ్రేణి సమర్థవంతంగా నిలువరించింది. మ్యాచ్ 37వ నిమిషంలో జోవావ్ ఫెలిక్స్ కొట్టిన హెడర్.. స్పెయిన్ కీపర్ ఉనై సైమన్ భుజానికి తగిలి గాల్లోకి లేచింది. దీన్ని రొనాల్డో కుడికాలి ఫ్లిక్ ద్వారా గోల్ చేయడానికి ప్రయత్నించగా.. సైమన్ వెంటనే కోలుకుని బంతిని ఒడిసిపట్టుకున్నాడు.
నూనో మెండిస్ కొట్టిన షాట్ స్పెయిన్ డిఫెండర్‌కు తగిలి డిఫ్లెక్ట్ అయి గోల్ పోస్ట్ క్రాస్‌బార్‌ను తాకడంతో పోర్చుగల్‌కు లక్కీ గోల్ చేజారింది. రెండో అర్ధభాగంలో ఇరు జట్లు డిఫెన్స్‌కే పరిమితమవడంతో ఆట కాస్త నెమ్మదించింది. అయితే మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు దారితీస్తుందనుకున్న తరుణంలో 85వ నిమిషంలో గ్రౌండ్లోకి వచ్చిన మెరినో స్పెయిన్ ట్రంప్ కార్డ్ అయ్యాడు. ఇంజూరీ టైమ్ మొదలైన వెంటనే ఫెరాన్ టోరెస్ అందించిన పాస్‌ను మెరినో.. పోర్చుగల్ కీపర్‌ను దాటుకుంటూ వెళ్లి లో ఫినిష్‌తో గోల్‌గా మలిచి స్పెయిన్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

