ముంబై: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma).. తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. ఇండియాకు వన్డే వరల్డ్‌కప్‌ను అందించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు అతను చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఆడాలని ఉన్నట్లు తెలిపాడు. బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే షోలో అతను ఛాట్ చేశాడు. దాంట్లో రిటైర్మెంట్ అంశాన్ని ప్రస్తావించాడు. తాను ఇప్పుడు రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదని, కానీ జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదని, ప్రస్తుతం బాగానే ఆడుతున్నానని, మరికొన్ని ఏళ్ల పాటు ఇలాగే ఆడాలన్న ఆలోచనలో ఉన్నానని, వరల్డ్‌కప్ గెలవాలన్న ఆశ ఉందని, డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా గెలవాలని ఉందన్నాడు.