IPL Hattricks | ముంబై ఇండియన్స్‌పై రోహిత్ శర్మ హ్యాట్రిక్.. లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..!
IPL Hattricks : హిట్‌మ్యాన్‌కు ఐపీఎల్లో అరుదైన రికార్డుంది. బ్యాటుతో విధ్వంసం సృష్టించే రోహిత్.. బంతితోనూ రాణించి హ్యాట్రిక్ తీశాడు. అది కూడా ముంబై ఇండియన్స్(Mumbai Indians)పైన.
IPL Hattricks : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన సారథుల్లో ఒకడైన రోహిత్ శర్మ (Rohit Sharma) అలవోకగా సిక్సర్లు కొడుతాడని తెలుసు. బౌలర్లను వణికిస్తూ తనమార్క్ ఫుల్షాట్లతో అలరించే హిట్‌మ్యాన్‌కు ఐపీఎల్లో అరుదైన రికార్డుంది. బ్యాటుతో విధ్వంసం సృష్టించే రోహిత్.. బంతితోనూ రాణించి హ్యాట్రిక్ తీశాడు. అది కూడా ముంబై ఇండియన్స్(Mumbai Indians)పైన. ఐపీఎల్ చరిత్రలో అమిత్ మిశ్రా (Amit Mishra) మూడు సార్లు ఈ ఫీట్‌తో రికార్డు నెలకొల్పాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకూ వరుసగా మూడు వికెట్లు తీసిన బౌలర్లు ఎవరంటే..?
ఐపీఎల్ కొత్త సీజన్ వస్తుందంటే చాలు రికార్డుల గురించిన చర్చ జరుగుతుంది. అత్యధిక పరుగులు, ఎక్కువ వికెట్లు.. రికార్డు బ్రేకర్స్ ఎవరు? వంటివి ఓసారి గుర్తు చేసుకుంటారంతా. హ్యాట్రిక్ తీసిన బౌలర్ల పేర్లు కూడా తెరమీదకు వస్తుంటాయి. వీరిలో అమిత్ మిశ్రా(Amit Mishra) రికార్డు స్థాయిలో మూడుసార్లు హ్యాట్రిక్ తీశాడు. ఆరంభ సీజన్లోనే దక్కన్ చార్జర్స్‌పై వరుసగా మూడు వికెట్లు తీసిన ఈ లెగ్ స్పిన్నర్.. 2011లో కింగ్స్ లెవన్ పంజాబ్‌పై, 2013లో పుణే వారియర్స్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు.
Where is the Deccan Chargers’ 2009 IPL trophy? Please officially hand it over to Rohit Sharma. @ChargersHome 🙏 pic.twitter.com/vNmWtSn5rZ
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 23, 2026
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రెండుసార్లు హ్యాట్రిక్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 2009లో ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ తీశాడు. వరుస బంతుల్లో అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్‌లను బౌల్డ్ చేసి.. జేపీ డుమినీని క్యాచ్ ఔట్ ద్వార వెనక్కి పంపి మూడో వికెట్ సాధించాడు.
ఐపీఎల్ హ్యాట్రిక్ వీరుల జాబితా
అమిత్ మిశ్రా – 2008(vs దక్కన్ ఛార్జర్స్), 2011(vs పంజాబ్ కింగ్స్), 2013 (vs పుణే వారియర్స్)
యువరాజ్ సింగ్ – 2009(vs ఆర్సీబీ), 2009(vs దక్కన్ ఛార్జర్స్)
లక్ష్మీపతి బాలాజీ – 2008 (vs పంజాబ్ కింగ్స్)
ముఖాయ ఎన్తిని – 2008 (vs కోల్‌కతా నైట్ రైడర్స్)
రోహిత్ శర్మ – 2009 (vs ముంబై ఇండియన్స్)
హర్భజన్ సింగ్ – 2009 (vs దక్కన్ ఛార్జర్స్)
Yuzvendra Chahal joins the list of multiple hat-trick takers in the IPL ✨
More numbers: https://t.co/DLXKy0lvPa pic.twitter.com/jy5mkL5kSt
— ESPNcricinfo (@ESPNcricinfo) May 1, 2025
ప్రవీణ్ కుమార్ – 2010 (vs రాజస్థాన్ రాయల్స్)
అజిత్ చండీలా – 2012 (vs పుణే వారియర్స్)
ప్రవీణ్ తాంబే – 2014 (vs కోల్‌కతా నైట్ రైడర్స్)
షేన్ వాట్సన్ – 2014 (vs సన్‌రైజర్స్ హైదరాబాద్)
అక్షర్ పటేల్ – 2016 (vs గుజరాత్ లయన్స్)
ఆండ్రూ టై – 2017 (vs రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్)
జయదేవ్ ఉనాద్కాత్ – 2017 (vs సన్‌రైజర్స్ హైదరాబాద్)
𝙒.𝙒.𝙒 🤯
First hat-trick of the season 😍
Second hat-trick of his IPL career 🫡Yuzvendra Chahal is his name 😎
Updates ▶ https://t.co/eXWTTv8v6L #TATAIPL | #CSKvPBKS | @yuzi_chahal pic.twitter.com/4xyaX3pJLX
— IndianPremierLeague (@IPL) April 30, 2025
సామ్ కరన్ – 2019 (vs ఢిల్లీ క్యాపిటల్స్)
శ్రేయాస్ గోపాల్ -2019 (vs ఆర్సీబీ)
హర్షల్ పటేల్ – 2022 (vs ముంబై ఇండియన్స్)
యజ్వేంద్ర చాహల్ – 2022 (vs కోల్‌కతా నైట్ రైడర్స్), 2025 (చెన్నై సూపర్ కింగ్స్)
రషీద్ ఖాన్ – 2023 (vs కోల్‌కతా నైట్ రైడర్స్)
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

