భారత జట్టులోని అద్భుతమైన ఫీల్డర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు కూడా కచ్చితంగా ఉంటారు. అయితే వీరిద్దరి ఫీల్డింగ్ విధానంలో చాలా తేడా ఉంటుందని జట్టు మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ చెప్పాడు. కోహ్లీ చాలా ఎగ్రెసివ్‌గా ఉంటాడని, ఒక విధంగా క్రీజులో ఉన్న ఆటగాళ్లు బెదిరేలా చేస్తాడని శ్రీధర్ అభిప్రాయపడ్డాడు.
అందుకే ఆరంభంలో అతన్ని షార్ట్ మిడ్‌వికెట్, షార్ట్ కవర్లో ఫీల్డింగ్‌కు పంపేవాళ్లమన్నాడు. బ్యాట్స్‌మెన్ కళ్ల ముందు కోహ్లీ ఉంటే ఆ ఆటగాడు కొంచెం ఆలోచించి ఆడాల్సిన పరిస్థితి ఉంటుందని వివరించాడు. అయితే ఆ తర్వాత లాంగ్ రన్లో అతన్ని స్లిప్స్‌లోకి మార్చామని వెల్లడించాడు. బంతి ఎంత కిందకు వచ్చినా అంత వేగంగా కిందకు దిగే సామర్ధ్యం కోహ్లీకి ఉందన్నాడు.
అందుకే అతను స్లి్ప్స్లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని తెలిపాడు. అదే సమయంలో రోహిత్ శర్మ సహజమైన స్లిప్ ఫీల్డర్ అని కొనియాడాడు. అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో ‘స్టిక్కీ ఫింగర్స్’ అని పిలుస్తామని చెప్పాడు. మ్యాచ్ ముందు ప్రిపరేషన్ కోసం కనీసం 70-80 స్లిప్ క్యాచులు అందుకుంటేకానీ రోహిత్ ప్రిపరేషన్ పూర్తికాదని వెల్లడించాడు. వీరిద్దరూ భిన్నమైన పద్ధతులు అవలంబించినప్పటికీ.. స్లిప్స్‌లో వీరికంటే మంచి ఫీల్డర్స్ ఉండరని కొనియాడాడు.