Rohan Reddy | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే సౌత్‌వెస్ట్‌జోన్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌నకు రాష్ర్టానికి చెందిన యువ స్విమ్మర్ రోహన్‌రెడ్డి ఎంపికయ్యాడు.
మూడు రోజుల పాటు జరిగే టోర్నీలో రోహన్..50మీటర్ల ఫ్రీస్టయిల్, 50మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 100మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో అనురాగ్ యూనివర్సిటీ తరఫున బరిలోకి దిగనున్నాడు.