DC vs CSK | ఢిల్లీని ఆదుకున్న రిజ్వీ, స్టబ్స్.. చెన్నైకి సూపర్ ఛాన్స్..!
DC vs CSK : పంతొమ్మిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. ఆర్సీబీపై 75 పరుగులకే ఆలౌట్ నుంచి పాఠాలు నేర్వకపోవడం ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లో పడేసింది.
DC vs CSK : పంతొమ్మిదో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మరోసారి తడబడ్డారు. ఆర్సీబీపై 75 పరుగులకే ఆలౌట్ నుంచి పాఠాలు నేర్వకపోవడం ఆ జట్టును ఆదిలోనే కష్టాల్లో పడేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 69కే ఐదు వికెట్లు పడిన వేళ ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(40 నాటౌట్), స్టబ్స్ (38) ఆదుకున్నారు. ఆఖర్లో అశుతోష్ శర్మ(14) రెండు సిక్సర్లతో స్కోర్ దాటించాడు. చివరి బంతికి రిజ్వీ సిక్సర్ బాదగా ఢిల్లీ ప్రత్యర్థికి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి భారీస్కోర్ కొట్టాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్లు నిశాంక(19), కేఎల్ రాహుల్(12) శుభారంభమివ్వకుండానే ఔటయ్యారు. ముకుల్ ఓవర్లో నిశాంక, హొసేన్ బౌలింగ్లో రాహుల్ పెద్ద షాట్ ఆడేక్రమంలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. వెంట వెంటనే రెండు వికెట్లు పడడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 37 పరుగులకే పరిమితమైంది.
Twists, turns, and two lethal spinners! 🔄
🎥 Akeal Hosein and Noor Ahmad are weaving magic from both ends 🪄
Updates ▶️ https://t.co/f1bRZthndy#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @ChennaiIPL | @AHosein21 | @noor_ahmad_15 pic.twitter.com/uGUzd7d2Dk
— IndianPremierLeague (@IPL) May 5, 2026
69కే ఐదు వికెట్లు
చెన్నై బౌలర్లు బౌండరీలకు అవకాశమివ్వకపోడంతో కరుణ్ నాయర్(13), నితీశ్ రానా(15) ఆచితూచి ఆడిన క్రీజులో నిలవలేదు. నూర్ అహ్మద్ ఈ ఇద్దరిని ఔట్ చేసి ఢిల్లీని మరింత దెబ్బ కొట్టాడు. కెప్టెన్ అక్షర్ పటేల్(2)ను గుర్జప్నీత్ డగౌట్ చేర్చగా చూస్తుండగానే.. 69కే ఐదు వికెట్లు పడ్డాయి. దాంతో, ఢిల్లీ స్కోర్ 120 దాటితే గొప్ప అనిపించింది.
Standing tall and punching back! 👊
Tristan Stubbs and Sameer Rizvi with a very crucial 5️⃣0️⃣-run stand for #DC 🤝
Updates ▶️ https://t.co/f1bRZthndy#TATAIPL | #KhelBindaas | #DCvCSK | @DelhiCapitals pic.twitter.com/pMdhLi6DQo
— IndianPremierLeague (@IPL) May 5, 2026
కానీ, కుర్రాళ్లు ట్రిస్టన్ స్టబ్స్(38), ఇంప్యాక్ట్ సబ్ సమీర్ రిజ్వీ(40 నాటౌట్)లు జట్టుకు గౌరవప్రదమైన స్కోరందిచే బాధ్యత తీసుకున్నారు. ఒత్తిడిలోనూ గొప్పగా ఆడిన ఈ ద్వయం అర్ధ శతక భాగస్వామ్యం నెలకొల్పింది. అన్షుల్ బౌలింగ్లో అశుతోష్ శర్మ(14) రెండు సిక్సర్లు, చివరి బంతిని రిజ్వీ స్టాడ్స్లోకి పంపగా స్కోర్ 150 దాటింది. దాంతో, నిర్ణీత ఓవర్లలో 155 పరుగులు చేసిన ఢిల్లీ బౌలర్లనే నమ్ముకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

