Rishabh Pant: 12 కోట్లు వదులుకున్న రిషబ్ పంత్.. మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి
Rishabh Pant: రిషబ్ పంత్ లక్నోను వీడాడు. మళ్లీ అతను డీసీలో చేరాడు. అయితే ఫ్రాంచైజీ ఫీజులో భారీ కోత పడింది. కేవలం 15 కోట్లకే అతను ఢిల్లీతో కలిశాడు. 27 కోట్లకు అతన్ని లక్నో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజా ట్రేడింగ్‌లో ఢిల్లీ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ లక్నోకు.. పంత్ డీసీలో చేరాడు.
న్యూఢిల్లీ: రిషబ్ పంత్(Rishabh Pant) మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చేశాడు. గత రెండు సీజన్లు ఐపీఎల్లో లక్నో సూపర్ గెయింట్స్‌కు ఆడిన రిషబ్ పంత్ ఇప్పుడు మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనున్నాడు. ఇక డీసీలో ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. లక్నో జట్టులోకి వెళ్లనున్నాడు. అయితే కేవలం 15 కోట్ల ఒప్పందానికి మళ్లీ ఢిల్లీ జట్టులోకి చేరేందుకు పంత్ అంగీకరించాడు. వాస్తవానికి లక్నో యాజమాన్యం అతన్ని 27 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఇటీవల రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ సరిగా లేని కారణంగా అతను ఆ జట్టును వీడేందుకు సముఖత వ్యక్తం చేశాడు. లక్నో నుంచి ఢిల్లీకి మారడం వల్ల రిషబ్ పంత్‌కు 12 కోట్ల నష్టం జరిగింది.
మరో వైపు కుల్దీప్ యాదవ్ మాత్రం ప్రస్తుతం ఉన్న 12.50 కోట్ల ఫీజుకే బదిలీ అయ్యాడు. పంత్ మళ్లీ తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీతో త్వరలో జతకలవనున్నాడు. 2016 నుంచి 2024 మధ్య కాలంలో ఢిల్లీ తరపున పంత్ సుమారు 111 మ్యాచ్‌లు ఆడాడు. 2021 నుంచి 2024 మధ్య ఆ జట్టుకు పగ్గాటు కూడా చేపట్టాడతను. కానీ లక్నో జట్టుతో మాత్రం అతను ఆశించినంతగా రాణించలేదు. కెప్టెన్‌గా, కీపర్‌గా అతను విఫలం అయ్యాడు.
2026 ఐపీఎల్లో లక్నో జట్టు కేవలం 8 పాయింట్లతో అట్టడుగున నిలిచింది. 2025 ఐపీఎల్లో 14 మ్యాచుల్లో పంత కేవలం 269 రన్స్ చేశాడు. ఇక ఈ ఏడాది అతను కేవలం 312 రన్స్ మాత్రమే చేశాడు.
🚨 Announcement 🚨
Rishabh Pant and Kuldeep Yadav complete high-profile trade between @DelhiCapitals and @LucknowIPL.
Rishabh Pant all set to rejoin #DC at INR 15 Crore whereas Kuldeep Yadav will join #LSG at INR 13.5 Crore.
More Details ▶️ https://t.co/64HeOX143I… pic.twitter.com/tIEvj7fgNo
— IndianPremierLeague (@IPL) June 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

