JioDive VR headset | ఐపీఎల్ ప్రేక్షకుల కోసం రిలయన్స్ జియో స్పెషల్ హెడ్ సెట్ తీసుకొచ్చింది. ఐపీఎల్ మ్యాచ్‌లను వర్చువల్ రియాల్టీలో వీక్షించడానికి జియో డ్రైవ్ వీఆర్ హెడ్ సెట్ (Jio Dive VR Headset) అనే పేరుతో తెచ్చిన ఈ హెడ్ సెట్ ఉపయోగించుకోవచ్చు. 100-అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360డిగ్రీస్ వ్యూలో మ్యాచ్‌లు వీక్షించవచ్చు. జియో సినిమా యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించే వారికి మాత్రమే ఈ స్పెషల్ హెడ్ సెట్ ఉపయోగ పడుతుంది. దేశీయ మార్కెట్లో జియో డ్రైవ్ హెడ్ సెట్ రూ.1299లకే లభిస్తుంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా కొనే వారికి రూ.500 క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది.
ఆండ్రాయిడ్ ఐఓఎస్-15 వర్షన్‌తోపాటు తర్వాత అందుబాటులోకి వచ్చిన ఓఎస్ వర్షన్‌తో పని చేసే స్మార్ట్ ఫోన్లలోనూ ఇది పని చేస్తుంది. ఫోన్ డిస్ ప్లే 47 -6.7 అంగుళాల నిడివి ఉండాలి. ఫోన్లో గైరోస్కోప్, యాక్సెలెరో మీటర్ కూడా తప్పనిసరిగా ఉండాలి. మెరుగ్గా మ్యాచ్ వీక్షించడానికి హెడ్ సెట్లో స్పెషల్ ఏర్పాట్లు చేశారు. ఈ హెడ్ సెట్ ఉపయోగించే వారు తప్పనిసరిగా జియో ఇమ్మర్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి అని జియో స్పష్టం చేసింది.
జియో డైవ్ హెడ్సెట్ కొన్న వారు.. దాంతోపాటు వచ్చే బాక్స్ మీద గల క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే జియో ఇమ్మర్స్ యాప్ డౌన్ లోడ్ అవుతుంది. అవసరమైన పర్మిషన్లు ఇస్తూ లాగిన్ కావాలి. యూజర్లు ఖచ్చితంగా జియో నెట్ వర్క్ కు మాత్రమే కనెక్ట్ అయి ఉండాలి. జియో డైవ్ ఆప్షన్ ఎంపిక చేసుకుని ‘వాచ్ ఆన్ జియో డైవ్’ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. హెడ్ సెట్ ముందు కవర్ ఓపెన్ చేసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్ మధ్య అమర్చి కవర్ మూసేయాలి. జియో డైవ్ హెడ్ సెట్ తలకు పెట్టుకుని లెన్స్ సెట్ చేసుకున్న తర్వాత మ్యాచ్ చూడవచ్చు.