IPL 2024 RCB vs LSG : ఐపీఎల్ 17వ సీజన్ 15వ మ్యాచ్‌కు మరికాసేపట్లో తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB), లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఆడుతున్నాయి. టాస్ గెలిచిన డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అల్జారీ జోసెఫ్ స్థానంలో టాప్లే ఆడుతున్నాడు.
మోగా టోర్నీలో మూడింటిలో ఒకే ఒక్క విజయం సాధించిన ఇరుజట్లు రెండో గెలుపు కోసం ఆకలిగొన్న సింహాల్లా తలపడనున్నాయి. గత సీజన్లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ ఫ్యాన్స్‌కు మస్త్ కిక్ ఇచ్చింది. ఆఖరి ఓవర్ ఉత్కంఠకు తోడు మైదానంలో కోహ్లీ, నవీన్ ఉల్ హక్, అప్పటి మెంటార్ గంభీర్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే.
ఆర్సీబీ జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, అనుజ్ రావత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్, సిరాజ్, టాప్లే, మయాంక్ దగర్, యశ్ దయాల్.
లక్నో జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయూష్ బదౌనీ, కృనాల్ పాండ్యా, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, నవీన్ ఉల్ హక్.