బంజారాహిల్స్,ఏప్రిల్ 2: ఫేస్బుక్లో పరిచయం అయిన యువతిని పెళ్లి పేరుతో మోసం చేసి ముఖం చాటేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు(Cheating case) నమోదయింది. వివరాల్లోకి వెళ్తే..పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన రుమ్మీ షేక్ (32) అనే యువతి జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లోని గాయత్రీహిల్స్లో నివాసం ఉంటూ బ్యూటీపార్లర్లో పనిచేస్తోంది. ఫేస్బుక్ ద్వారా ఆమెకు పరిచయం అయిన రవికుమార్ ప్రేమిస్తున్నానని(Love affair) సన్నిహితంగా ఉంటున్నాడు.
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆమె వద్దనుంచి పలు సందర్బాల్లో అవసరం ఉందంటూ రూ.15లక్షలు తీసుకున్నాడు. అయితే ఇటీవల తనకు డబ్బులు అవసరం ఉందని, డబ్బులు తిరిగి ఇవ్వాలని రుమ్మీ షేక్ అడిగింది. అయితే డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు పెళ్లి విషయం దాటేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నా ఎత్తకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 420, 406 సెక్షన్ కింద నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.