RCV Vs GT | గుజరాత్ టైటాన్స్ జట్టుకు రాయల్ చాలెంజర్స్ జట్టు 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి ఆర్సీబీ 169 పరుగులు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిశోర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ తక్కువ స్కోర్‌కే వెనుదిరిగింది. గుజరాత్ బౌలర్లు నిప్పులు చెరగడంతో ఒక దశలో ఆర్సీబీ ఒక దశలో 42 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ జోడీ ఆర్సీబీని ఆదుకున్నది. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివరలో టిమ్ డేవిడ్ విజృంభించడంతో ఆర్సీబీ 169 పరుగులు చేయగలింది. గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు, సాయి కిషోర్ రెండు వికెట్లు పడగొట్టారు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలా ఒక వికెట్ దక్కింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్సీబీకి గుజరాత్ ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ తన తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఆర్సీబీ రెండో ఓవర్లో విరాట్ కోహ్లీ (8)ని అర్షద్ పెవిలియన్‌కు పంపాడు. ఇక హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన రెండో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ (7)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత ఫిల్‌సాల్ట్ (14) అవుట్ చేశాడు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ (12) అవుట్ అయ్యాడు. 42 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ ఆర్సీబీని లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ ఆదుకున్నారు. లివింగ్ స్టోన్ 40 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ సహాయంతో 54 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జితేశ్ శర్మ 21 బంతుల్లో ఐదు ఫోర్లు, సిక్సర్ సహాయంతో 44 పరుగులు చేశాడు. కృణాల్ పాండ్యా (5) పరుగులు చేయగా.. చివరలో టిమ్ డేవిడ్ 18 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 32 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌కు 3 వికెట్లు, సాయి కిశోర్‌కి రెండు వికెట్లు పడగొట్టగా.. అర్షద్‌ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్‌కు తలో వికెట్ దక్కింది.