Mohammad Siraj | ఆ నియమంతో బౌలర్లకు చేటు.. రద్దు చేయాల్సిందే
Mohammad Siraj : ఐపీఎల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన 'ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player) నిబంధనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) ఇంప్యాక్ట్ ప్లేయర్ నియమంతో బౌలర్లు నష్టపోతున్నారని అన్నాడు
Mohammad Siraj : ఐపీఎల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన ‘ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player) నిబంధనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే.. ఎక్కువ మంది మాత్రం ఈ నియమాన్ని ఎత్తేయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స మాజీ సారథి రోహిత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్‌లు ఈ రూల్‌ను రద్దు చేయాలని డిమండ్ చేశారు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) సైతం ఇదే మాట చెప్పాడు.
ఇంప్యాక్ట్ ప్లేయర్ నియమంతో బౌలర్లు నష్టపోతున్నారని, తక్షణమే ఈ రూల్‌ను రద్దు చేయాలని సిరాజ్ అన్నాడు. ‘ఐపీఎల్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ బ్యాటర్లకు అనుకులంగా ఉంది. దీంతో, ఆల్‌రౌండర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దయచేసి ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనను రద్దు చేయండి’ అని ఐపీఎల్, బీసీసీఐ మేనేజ్మెంట్ను సిరాజ్ అభ్యర్థించాడు.
16వ సీజన్లో..
ఐపీఎల్‌ను మరింత రక్తి కట్టించేందుకు 16వ సీజన్లో బీసీసీఐ ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. ఇరుజట్లు ఏ సమయంలోనే ఒక ఆటగాడిని ఇంప్యాక్ట్ సబ్‌గా తీసుకునే వీలుంది. దాంతో, అన్ని జట్లు పవర్ హిట్టర్ లేదా స్పెషలిస్ట్ బౌలర్‌ను తుది జట్టులో ఆడిస్తాయి. ఇంకేముంది ఆల్‌రౌండర్లు డగౌట్‌కే పరిమితం అవుతున్నారు. అందుచేత ఈ నియమంపై పలువురు క్రికెటర్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నా సరే బీసీసీఐ మాత్రం నోరు మెదపడం లేదు.

పదిహేడో సీజన్లోనూ బెంగళూరు ఆట మారలేదు. బ్యాటర్లు రాణిస్తున్నా బౌలర్లు విఫలమవ్వడంతో ఈసారి కూడా డూప్లెసిస్ సేన ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో మ్యాచ్‌లో భారీ స్కోర్ సమర్పించుకున్న ఆర్సీబీ ఆ తర్వాత గట్టిగానే పోరాడినా విజయం దక్కలేదు.
విల్ జాక్స్(55)

కోల్‌కతా నిర్దేశించిన 222 పరుగుల ఛేదనలో ఆర్సీబీ హిట్టర్లు విల్ జాక్స్(55), రజత్ పాటిదార్(52)లు అర్ధ శతకాలో కదం తొక్కగా.. కరణ్ శర్మ(20) చివరి ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు. అయితే.. ఆఖరి బంతికి ఫెర్గూసన్ రనౌట్ కావడంతో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో, ఏడో ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగుకే పరిమితమైంది. ఆసియా కప్ (Asia Cup 2023), దక్షిణాఫ్రికా పర్యటనలో నిప్పులు చెరిగిన సిరాజ్.. పదిహేడో సీజన్లో మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ అయి ఉండి ఆర్సీబీకి బ్రేక్ ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పటివరకూ ఆరు మ్యాచుల్లో ఈ స్పీడ్‌స్టర్ ఒకే ఒక వికెట్ తీశాడంటేనే అతడి పేస్ పవర్ ఏ స్థాయికి పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
- Tammy Beaumont | బాయ్‌ఫ్రెండ్‌తో పెండ్లి.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ ఫొటోలు వైరల్
- Vivo V30e | మే 2న వివో వీ30ఈ లాంఛ్ : ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..!
- Zomato | జొమాటో కీలక నిర్ణయం.. 25 శాతం ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు.. ఇక ఆ సర్వీసుకు రాంరాం..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

