IPL 2024 | చెన్నై కంచుకోటలో తొలిపోరు.. ఆర్సీబీ బోణీ కొట్టేనా..?
IPL 2024 : మండుటెండల్లో క్రీడా వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) కొత్త సీజన్‌కు సర్వం సిద్ధమైంది. పదిహేడో సీజన్ టైటిల్ కోసం పది జట్లు కొదమ సింహాల్లా తలపడేందుకు కాచుకొని ఉన్నాయి. తొలి పోరుకు మరికొన్ని గంటలే ఉన్నందున విజేతగా నిలిచేది ఎవరు? అని ఫ్యాన్స్..
IPL 2024 : మండుటెండల్లో క్రీడా వినోదాన్ని పంచే ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) కొత్త సీజన్‌కు సర్వం సిద్ధమైంది. పదిహేడో సీజన్ టైటిల్ కోసం పది జట్లు కొదమ సింహాల్లా తలపడేందుకు కాచుకొని ఉన్నాయి. తొలి పోరుకు మరికొన్ని గంటలే ఉన్నందున విజేతగా నిలిచేది ఎవరు? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు చెపాక్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. తమ కంచుకోట అయిన చెపాక్‌లో బోణీ కొట్టాలని రుతురాజ్ గైక్వాడ్ బృందం భావిస్తోంది.
మరోవైపు ఈ మైదానంలో చెత్త రికార్డును చెరిపేయాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. అవును.. చెపాక్‌లో బెంగళూరుకు చెత్త రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఆ మైదానంలో చెన్నైపై బెంగళూరు ఒక్కటంటే ఒక్క మ్యాచ్ గెలిచిందంతే. అది కూడా 2008 ఎడిషన్‌లో. రాహుల్ ద్రవిడ్ 47 రన్స్ బాదగా.. అనిల్ కుంబ్లే 3 వికెట్లతో విజృంభించాడు.

దాంతో 127 పరుగుల ఛేదనలో ఆర్సీబీ 112 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత చెపాక్‌లో ఇరుజట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఆ ఏడింటా విజయబావుటా ఎగురవేసిన సీఎస్కే సొంతగడ్డపై తమకు తిరుగులేదని చాటుకుంది. ఐపీఎల్ 2019 ఎడిషన్ తొలి పోరులోనూ ఆర్సీబీ, సీఎస్కేలు చెపాక్‌లో ఢీకొన్నాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, జడేజాలు ఆర్సీబీని తిప్పేశారు.

అనంతరం స్వల్ప ఛేదనలో ఎల్లో జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇక 2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో డెవాన్ కాన్వే(Devan Conway) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ ఓటమిపాలైంది. అయితే.. గత రికార్డులు చెన్నై ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నా.. బెంగళూరును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

ఎందుకంటే.. 16వ సీజన్లో చెలరేగిన విరాట్ కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లకు ఈసారి విధ్వంసక ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తోడయ్యాడు. దాంతో, చెన్నై బౌలర్లకు చెపాక్‌లో కష్టాల్లు తప్పకపోవచ్చు. మరోవైపు సీఎస్కే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడనుంది. ఆసియా గేమ్స్‌లో టీమిండియా ఏ జట్టుకు గోల్డ్ మెడల్ అందించిన రుతురాజ్ గైక్వాడ్ సారథిగా తన ముద్ర వేస్తాడా? లేదా? చూడాలి. ఆరంభ వేడుకల అనంతరం రాత్రి 8ః00 గంటలకు ఇరుజట్ల మధ్య తొలి ఫైట్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచేది ఎవరు? రికార్డులు బ్రేక్ చేసేది ఎవరు? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
- IPL 2024 | టాస్‌కి ముందే గుడ్‌న్యూస్.. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ వచ్చేస్తున్నాడు
- Devara Movie | ‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ భార్యగా నటిస్తున్న : శ్రుతి మరాటే
- Siddaramaiah | అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అప్రజాస్వామికం : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

