Ravindra Jadeja | ఎడ్లబండి నడిపిన టీమిండియా ఆల్‌రౌండర్.. వీడియో వైరల్
Ravindra Jadeja : భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మైదానంలోకి దిగాడంటే బ్యాటుతో, బంతితో ప్రత్యర్థును బెంబేలెత్తిస్తాడు. అంతేకాదు హాఫ్ సెంచరీ కొట్టిన ప్రతిసారి కత్తిసాము చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. గుర్రపు స్వారీ(Horse Riding)లోనూ ఆరితేరిన...
Ravindra Jadeja : భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) మైదానంలోకి దిగాడంటే బ్యాటుతో, బంతితో ప్రత్యర్థును బెంబేలెత్తిస్తాడు. అంతేకాదు హాఫ్ సెంచరీ కొట్టిన ప్రతిసారి కత్తిసాము చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటాడు. గుర్రపు స్వారీ(Horse Riding)లోనూ ఆరితేరిన జడేజా తాజాగా ఎడ్లబండి(Bullock Cart) నడిపాడు.
భారీ కొమ్ములున్న రెండు ఎద్దులను అదిలిస్తూ నేర్పుగా బండిని పరుగులు పెట్టించాడు. ఆ వీడియోను జడ్డూ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ బుల్లాక్ రైడ్ వీడియోకు ‘వింటేజ్ రైడ్’ అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన అభిమానులు, మాజీ క్రికెటర్లు జడేజాను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.
2023లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'(Player Of The Year) అవార్డుకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli), ట్రావిస్ హెడ్(Travis Head), ప్యాట్ కమిన్స్(Pat Cummins) కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.
ట్రావిస్ హెడ్, కోహ్లీ, జడేజా, కమిన్స్

సొంత గడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023)లో అద్భుతంగా రాణించిన జడ్డూ.. దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం విఫలమయ్యాడు. సఫరీ గడ్డపై రెండు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడిన ఈ ఆల్‌రౌండర్ కీలకమైన రెండో టెస్టులో బ్యాటుతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఎంగిడి ఓవర్లో జడ్డూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
రవీంద్ర జడేజా

అయితే.. బుమ్రా, సిరాజ్ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో టీమిండియా ఎల్గర్ సేనన కట్టడి చేసింది. ఆ తర్వాత 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. స్వదేశంతో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం సన్నద్ధంకానున్నాడు.
ఇవి కూడా చదవండి
- Rishabh Pant | సందడిగా పంత్ సోదరి పెండ్లిచూపుల వేడుక.. ఫొటోలు చూశారా..!
- AP News | టీడీపీ, జనసేనతోనూ పోరాటం చేస్తాం.. ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
- TSRTC Bus | పొగమంచు.. ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొట్టిన టీఎస్ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

