Ravindra Jadeja : ఆస్ట్రేలియాపై రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కెరీర్ బెస్టు గణాంకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ కొట్టిన అతను ఈ ఫార్మాట్లో రెండోసారి పది వికెట్ల ఫీట్ సాధించాడు. అంతేకాదు ఈ టెస్టులో జడేజా 21 ఏళ్ల రికార్డు బద్ధలు కొట్టాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లను బౌల్డ్ చేసి అతను ఈ రికార్డు సృష్టించాడు. భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. 21 ఏళ్ల క్రితం.. అంటే 1992లో జోబర్గ్‌లో ఐదుగురు దక్షిణాఫ్రికా ప్లేయర్స్‌ను కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో బౌల్డ్ చేశాడు.
ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో మార్నస్ లబూషేన్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, నాథన్ లయాన్, కుహ్నేమాన్లను జడేజా బౌల్డ్ చేశాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా ఈ ఫీట్ సాధించాడు. 2002లో లాహోర్‌లో న్యూజిలాండ్‌పై ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఐదుగురిని బౌల్డ్ చేశాడు.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టుల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలుపొందింది. రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించాడు. అతని దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జడ్డూ 42 రన్స్ ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ కూడా మూడు వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 113కు ఆలౌట్ అయింది. 115 పరుగుల టార్గెట్ ఛేదనలో పూజారా 31, కేఎస్ భరత్ 23తో అజేయంగా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్‌లో పది వికెట్ల ప్రదర్శన చేసిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో, నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో టెస్టు ఇండోర్‌లో మార్చి 1న ప్రారంభం కానుంది.
Just @imjadeja things 🫡🫡#INDvAUS pic.twitter.com/6wm0OeykQn
— BCCI (@BCCI) February 19, 2023