Ashwin on Ravi Sastri | టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిపై జట్టు ఆఫ్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన ఆరోపణలు చేశాడు. తనను అణచివేసేందుకు ప్రయత్నించాడని చెప్పాడు. గతంలో రవిశాస్త్రి కామెంట్ల తర్వాత తనను బస్సు నుంచి బయటకు తోసేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడిందన్నాడు. రవిశాస్త్రి హయాంలో తన కెరీర్ భయంకరమైందని వ్యాఖ్యానించాడు. పలు దఫాలు రిటైర్మెంట్ ప్రకటించాలన్నభావనకు వచ్చే వాడినని ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
2019లో ఆస్ట్రేలియా సిరీస్‌లో సిడ్నీ టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసినందుకు కుల్దీప్ యాదవ్ సంతోషించారన్నాడు. ఆస్ట్రేలియా వంటి జట్టుపై ఆడినప్పుడు సిడ్నీ టెస్ట్‌లో ఒక స్పిన్నర్ ఐదు వికెట్లు తీయడం ఎంత కష్టమో కుల్దీప్ యాదవ్‌కు తెలుసునన్నాడు. కానీ రవిశాస్త్రి వ్యాఖ్యలు తనను ఖచ్చితంగా అణచివేస్తున్నాడనిపించింది. రవి శాస్త్రిని గురించి తాను గొప్పగా ఊహించుకున్నా. తామంతా పని చేయాలి. విపత్కర పరిస్థితులు ఎదురైనా తిరిగి అధిగమించగలమని నాకూ తెలుసు. కానీ ఆ క్షణంలో తనను అణచివేస్తున్నారని అనిపించిందన్నాడు రవిచంద్రన్ అశ్విన్.