Ravi Shastri on Hardik Pandya | హార్ధిక్ పాండ్యపై రవిశాస్త్రి ఏమన్నారంటే?!
Ravi Sastri on Hardik Pandya | టీం ఇండియా వీలైనంత త్వరగా మరో ఆల్‌రౌండర్‌ను వెతుక్కోవాలని జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు.
Ravi Shastri on Hardik Pandya | వీలైనంత త్వరగా టీం ఇండియా మరో ఆల్ రౌండర్‌ను వెతుక్కోవాలని టీం మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. వెన్నెముకకు గాయంతో టీం ఇండియా జట్టులో హార్దిక్ పాండ్య చోటు దక్కించుకోలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్నా గతంలో మాదిరిగా రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో రవి శాస్త్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. పాండ్యను పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌గా తీసుకోవాలన్న వాదనను శాస్త్రి తోసి పుచ్చారు.
టీం ఇండియా జట్టుకు ఆరో స్థానంలో రాణించే ఆల్‌రౌండర్ అవసరం ఉందని రవిశాస్త్రి అన్నారు. టాప్-5 బౌలర్లతోపాటు మరొకరు ఎవరైనా రెండు, మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తే మిగతా బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందన్నాడు. జట్టు సారధిపైనా భారం ఉండదన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా జట్టు కోసం తీవ్ర పోటీ ఉందని చెప్పాడు రవిశాస్త్రి. కనుక పాండ్య మళ్లీ ఆల్ రౌండర్‌గా రాణిస్తే టీం ఇండియాలో ఆటోమేటిక్‌గా చోటు దక్కించుకున్నట్లేనన్నాడు.
టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉందని, ఫాస్ట్ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో స్వల్ప మార్పులు చేస్తే సరిపోతుందని రవిశాస్త్రి అన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు సారధిగా హార్దిక్ పాండ్యా ప్రాతినిధ్యం వహించనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

