IPL 2025 | రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్.. పవర్ ప్లేలో సన్‌రైజర్స్‌కు పెద్ద షాక్.. !
IPL 2025 : గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో సన్‌రైజర్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్ పట్టడంతో డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(20) ఔటయ్యాడు.
IPL 2025 : గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన భారీ ఛేదనలో సన్‌రైజర్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్ పట్టడంతో డేంజరస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(20) ఔటయ్యాడు. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా హెడ్ కొట్టిన బంతిని.. రషీద్ పరుగెడుతూ వెళ్లి ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 49 వద్ద హైదరాబాద్ తొలి వికెట్ పడింది. ప్రస్తుతం అభిషేక్ శర్మ(30), ఇషాన్ కిషన్(6)లు ఆడుతున్నారు. 7 ఓవర్లకు స్కోర్.. 63-1. ఇంకా కమిన్స్ సేన విజయానికి 162 రన్స్ కావాలి.
అహ్మదాబాద్‌లో 225 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. సిరాజ్ వేసిన తొలి బంతినే అభిషేక్ శర్మ(30) స్టాండ్స్‌లోకి పంపాడు. ట్రావిస్ హెడ్(20) సైతం ఫోర్ కొట్టగా 15 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో అభిషేక్ సిక్సర్ బాదాడు. 4వ ఓవర్లో హెడ్ 4 కొట్టగా.. అభిషేక్ సిక్సర్‌తో స్కోర్ 40 దాటింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ప్రసిధ్ విడదీసి గుజరాత్‌కు బ్రేకిచ్చాడు.
#SRH lose Travis Head inside the powerplay ☝️
Swipe to see the brilliance of Rashid Khan 🤩
Updates ▶ https://t.co/u5fH4jQrSI#TATAIPL | #GTvSRH | @rashidkhan_19 pic.twitter.com/1DKtiha4oy
— IndianPremierLeague (@IPL) May 2, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
Suspension | కామారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 14 మంది మెడికోలపై సస్పెన్షన్!
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

