Rashid Khan | రషీద్ ఖాన్ ఫిట్.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక
Rashid Khan : అఫ్గనిస్థాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఫిట్నెస్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. దాంతో అఫ్గన్ క్రికెట్ బోర్డు(ACB) ఈ స్టార్ ఆటగాడిని వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. 'రషీద్ ఖాన్ జట్టుతో కలవడం మాకు శుభవార్త లాంటిది. అతడి రాక మా టీమ్‌కు...
Rashid Khan : అఫ్గనిస్థాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్(Rashid Khan) ఫిట్నెస్ సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. దాంతో అఫ్గన్ క్రికెట్ బోర్డు(ACB) ఈ స్టార్ ఆటగాడిని వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. బంగ్లాపై రషీద్‌కు మెరుగైన రికార్డు ఉంది. 2019లో అతను మ్యాజిక్ చేయడంతో అఫ్గనిస్థాన్ విజయం సాధించింది. తొలి వన్డే జూలై 4న మొదలవ్వనుంది.
‘రషీద్ ఖాన్ జట్టుతో కలవడం మాకు శుభవార్త లాంటిది. అతడి రాక మా టీమ్‌కు కొండంత బలాన్నిస్తుంది. అతడితో పాటు జట్టులోని ప్రతిఒక్కరు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. అంతేకాదు వాళ్ల బాధ్యతల పట్ల వాళ్లకు పూర్తి అవగాహన ఉంది’ అని అఫ్గన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలెక్టర్ అసదుల్లాహ్ ఖాన్(Asadullah Khan) తెలిపాడు. ఏకైక టెస్టులో బంగ్లా రికార్డు విజయం సాధించింది. మొమినుల్ హక్, నజ్మల్ హుసేన్ శాంటో సెంచరీలతో కదం తొక్కారు. దాంతో, భారీ లక్ష్య ఛేదనలో అఫ్గనిస్థాన్ 115 పరుగులకే ఆలౌటయ్యియింది. దాంతో, బంగ్లదేశ్ 546 పరుగలు తేడాతో గెలుపొందింది.
19 మంది బృందం ఇదే
హష్మతుల్లా షహీదీ(కెప్టెన్), రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజిబుల్లా జద్రాన్, మహమ్మద్ నబీ, ఇక్రం అలిఖీ, రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రహ్మన్, ఫజల్హక్ ఫారూఖీ, అబ్దుల్ రహ్మన్, షహీదుల్లాహ్, జియా ఉర్ రెహ్మాన్, వఫదార్ మొమంద్, మహమ్మద్ సలీం, సయ్యద్ షిర్జాద్.
ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టిన రషీద్ ఖాన్

తొలి హ్యాట్రిక్
ఐపీఎల్ 16వ సీజన్లో రషీద్ ఖాన్ సంచలన ప్రదర్శన చేశాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్()కు ఆడుతున్న అతను ఈ సీజన్లో తొలి హ్యాట్రిక్(Hat-trick) నమోదు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై అతను వరుస బంతుల్లో ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్‌ను ఔట్ చేశాడు. అంతేకాదు ఆఖరి ఓవర్లలో ధనాధన్ ఆటతో ప్రత్యర్థులకు వణుకు పుట్టించాడు. ఈ క్రమంలోనే ఈ మిస్టరీ స్పిన్నర్ ఐపీఎల్లో తొలి హాఫ్ సెంచరీ కొట్టాడు. అది కూడా బలమైన ముంబై ఇండియన్స్‌పై. వెన్నెముక గాయం కారణంగా రషీద్ ఖాన్ బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరమయ్యాడు.
ఇవి కూడా చదవండి
Kapil Dev | 1983 వరల్డ్ కప్.. కపిల్ దేవ్ మెరుపు సెంచరీ కొట్టింది ఈరోజే
Moeen Ali | మోయిన్ అలీకి షాక్.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన ఐసీసీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

