Moeen Ali | మోయిన్ అలీకి షాక్.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన ఐసీసీ
Moeen Ali : యాషెస్ సిరీస్(Ashes Series)తో టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు మోయిన్ అలీ(Moeen Ali)కి ఊహించని షాక్. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 89వ ఓవర్ సమయంలో ఈ ఆల్‌రౌండర్ ఐసీసీ కోడ్(ICC Code of Conduct) ఉల్లంఘించాడు. బౌలింగ్ చేసే చేతికి డ్రైయింగ్ స్ప్రే(Drying Sparay) కొడుతూ....
Moeen Ali : యాషెస్ సిరీస్(Ashes Series)తో టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు మోయిన్ అలీ(Moeen Ali)కి ఊహించని షాక్. ఐసీసీ అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. అసలేం జరిగిందంటే…? ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఆల్‌రౌండర్ ఐసీసీ కోడ్(ICC Code of Conduct) ఉల్లంఘించాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ 89వ ఓవర్ సమయంలో బౌలింగ్ చేసే చేతికి డ్రైయింగ్ స్ప్రే(Drying Sparay) కొడుతూ దొరికిపోయాడు.
దాంతో, అతను ఐసీసీ నియమావళి(ఆర్టికిల్ 2.20)ని అతిక్రమించినట్టు మ్యాచ్ రెఫరీ ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycroft ) గుర్తించాడు. ఈ విషయమై అలీని సంప్రదించగా అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో, అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడమే కాకుండా ఒక డీ మెరిట్ పాయింట్ ఇవ్వాలని ఆండీ ఐసీసీకి నివేదిక సమర్పించాడు. అతడి రిపోర్టు పరిశీలించిన ఐసీసీ అలీకి ఫైన్, డీ మెరిట్ పాయింట్ విధిస్తున్నట్టు తెలిపింది. గత రెండేళ్లలో మోయిన్ అలీ ఐసీసీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడడం ఇదే మొదటిసారి. తొలి టెస్టులో అతను ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్ వికెట్లు పడగొట్టాడు.
🚨 JUST IN: Moeen Ali found guilty of breaching ICC Code of Conduct!
More 👇https://t.co/iau6ufFNhx
— ICC (@ICC) June 18, 2023
జాక్ లీచ్ గాయపడడంతో..
రెండేళ్ల క్రితం మోయిన్ అలీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. అప్పటినుంచి వన్డేలు, టీ20ల్లో ఆడుతున్నాడంతే. అయితే.. యాషెస్ సిరీస్‌కు ముందు ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్(Jack Leach) గాయపడ్డాడు. దాంతో, అతడి ప్లేస్‌లో అనుభవజ్ఞుడైన అలీని తీసుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ECB) అనుకుంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా అలీని యాషెస్‌లో ఆడాలని కోరాడు. దాంతో, అతను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
ఐపీఎలో 16వ సీజన్లో మోయిన్ అలీ

ఐపీఎలో 16వ సీజన్లో ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు ఆడాడు. ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఫైనల్లో గుజరాట్ టైటాన్స్(Gujarat Titans)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకొని ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
ఇవి కూడా చదవండి
Ashes Series | ఆస్ట్రేలియా ఆలౌట్.. ఇంగ్లండ్‌కు 7 పరుగుల ఆధిక్యం
Jasprit Bumrah | బుమ్రా వచ్చేస్తున్నాడు.. ఐర్లాండ్ పర్యటనలో బరిలోకి యార్కర్ కింగ్..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

