Ashes Series : యాషెస్ సిరీస్ తొలిటెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా బదులిచ్చిన ఆస్ట్రేలియా(Australia) మూడో రోజు 386 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో, ఆతిథ్య ఇంగ్లండ్‌కు 7 పరుగుల ఆధిక్యం లభించింది. లంచ్ బ్రేక్‌కు ముందు ఓలీ రాబిన్సన్(Ollie Robinson) ఓవర్లో ప్యాట్ కమిన్స్(38) ఔట్ కావడతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ బౌలరల్లో ఓలీ రాబిన్సన్, స్టువార్ట్ బ్రాడ్(Stuart Broad) మూడేసి వికెట్లు తీశారు. మోయిన్ అలీ రెండు, స్టోక్స్ ఒక వికెట్ పడగొట్టారు. మరికాసేపట్లో బెన్ స్టోక్స్ బృందం రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.
ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియాకు తొలి సెషన్లో షాక్ తగిలింది. అలెక్స్ క్యారీ(66)ని జేమ్స్ అండర్సన్ బౌల్డ్ చేశాడు. క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (141)ను రాబిన్సన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కమిన్స్(38) పోరాడడంతో ఆసీస్ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. తొలిరోజు ఇంగ్లండ్ 393-8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. జో రూట్ (118) సెంచరీ, జానీ బెయిర్‌స్టో(78) హాఫ్ సెంచరీతో కదం తొక్కారు.