Baba Ramdev | రెజ్లర్లకు బాబా రాందేవ్ మద్దతు.. బ్రిజ్ భూషణ్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్
Baba Ramdev | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wrestling federation chief) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) మద్దతు ప్రకటించారు.
Baba Ramdev | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wrestling federation chief) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న భారత రెజ్లర్లకు యోగా గురువు బాబా రాందేవ్ (Baba Ramdev) మద్దతు ప్రకటించారు. భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లోని భిల్వారాలో మూడు రోజుల పాటు జరుగుతున్న యోగా కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్ల నిరసన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
‘రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ టాప్ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితి రావడం చాలా సిగ్గు చేటు. అలాంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అతడు తల్లులు, బిడ్డలు, అక్క చెల్లెళ్ల గురించి ప్రతిరోజూ అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. అతడి తీరు ఖండించదగినది’ అని అన్నారు.
కాగా, బ్రిజ్ భూషణ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. ఇంత వరకు అరెస్టు చేయకపోవడంపై రాందేవ్ బాబాను మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన రామ్‌దేవ్.. తాను కేవలం ప్రకటనలు మాత్రమే చేయగలనని చెప్పారు. అతడిని జైల్లో పెట్టే అధికారం తనకు లేదంటూ బదులిచ్చారు.
Also Read..
America | అమెరికాలో ఫెడరల్ హాలిడేగా దీపావళి.. చట్టసభలో బిల్లు
IIFA 2023 | విక్కీని పక్కకు నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
CM Nitish Kumar: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ దేనికి అవసరం? ప్రశ్నించిన బీహార్ సీఎం నితీశ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

