IIFA 2023 | ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల (International Indian Film Academy) వేడుక దుబాయ్‌లో గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ (Salman Khan), విక్కీ కౌశల్ (Vicky Kaushal) మధ్య ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఈవెంట్లో పాల్గొన్న వారితో విక్కీ కౌశల్ ఫొటోలు దిగుతుండగా.. అదే సమయంలో అటుగా సల్మాన్ ఖాన్ వచ్చారు. దీంతో ఆయన బాడీగార్డ్స్ (Salman Khan Security) విక్కీని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో సల్మాన్‌ను చూసిన విక్కీ కౌశల్ అతనితో ఏదో మాట్లాడుతుండగా.. అందుకు సల్మాన్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సల్మాన్, ఆయన బాడీగార్డ్స్ ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
‘సల్మాన్ బాడీగార్డ్స్ విక్కీని పక్కకు నెట్టేశారు.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలతో ఎలా ప్రవర్తించాలో సల్మాన్ తన బాడీగార్డ్స్‌కు చెప్పాలి కదా..!’, ‘తోటి నటుడితో ఎలా ప్రవర్తించాలో సల్మాన్‌కు తెలియదా..?’, ‘సల్మాన్ పొగరుకు ఈ వీడియోనే నిదర్శనం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read..
Cannes 2023 | కేన్స్‌లో అనుష్క మెరుపులు.. పిక్స్ వైరల్
CM KCR | నేడు కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ.. కేంద్రంపై పోరుకు మద్దతు కోరనున్న ఢిల్లీ సీఎం
IPL 2023: కోహ్లీ, గిల్ కాదు.. సెహ్వాగ్ దృష్టిలో ఐపీఎల్ టాప్-5 బ్యాటర్లు వీళ్లే