America | అమెరికాలో ఫెడరల్ హాలిడేగా దీపావళి.. చట్టసభలో బిల్లు
America | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి (Diwali) పండుగకు అగ్రరాజ్యం అమెరికా (America)లో ఫెడరల్ హాలిడే (Federal Holiday) ప్రకటించాలని కోరుతూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (House of Representatives) ఓ బిల్లును ప్రతిపాదించింది.
America | చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి (Diwali) పండుగకు అగ్రరాజ్యం అమెరికా (America)లో ఫెడరల్ హాలిడే (Federal Holiday) ప్రకటించాలని కోరుతూ యూఎస్ హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (House of Representatives) ఓ బిల్లును ప్రతిపాదించింది. ‘దివాళీ డే యాక్ట్’ (Diwali Day Act) పేరుతో రూపొందించిన ఈ బిల్లును డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సభ్యురాలు గ్రేస్ మెంగ్ (Graced Meng) శుక్రవారం చట్టసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దివాళీ డే యాక్ట్‌ను సభలో ప్రవేశపెడుతున్నందుకు గర్వంగా, సంతోషంగా ఉందని అన్నారు. దీపావళి పండగ రోజును ఫెడరల్ హాలిడేగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ బిల్లు తొలుత పార్లమెంట్లో పాస్ కావాల్సి ఉంటుంది. అనంతరం అధ్యక్షుడు సంతకంతో చట్టం అవుతుంది. ఈ బిల్లుపై చట్టసభ్యులు, అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ (Jenifer Rajkumar ) ప్రకటించారు. ఈ సంవత్సరం దీపావళి పండగను ఫెడరల్ హాలిడేగా జరుపుకొందామని అన్నారు. అమెరికాలో స్థిరపడిన దక్షిణాసియా దేశస్థులు అనుసరించే సంస్కతి, సంప్రదాయాలను గౌరవించుకున్నట్టవుతుందని వ్యాఖ్యానించారు.
ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే అమెరికా ఫెడరల్ హాలిడేస్‌లో 12వదిగా నిలవనుంది. అమెరికాలో ప్రస్తుతం 11 ఫెడరల్ హాలీడేస్ మాత్రమే ఉన్నాయి. న్యూ ఇయర్, మార్టిన్ లూథర్ కింగ్ జయంతోత్సవాలు, ప్రెసిడెంట్స్ డే, మెమొరియల్ డే, జునెటెంత్ డే, ఇండిపెండెన్స్ డే, లేబర్ డే, కొలంబస్ డే, వెటరన్స్ డే, థాంక్స్ గివింగ్ డే, క్రిస్మస్ డే సందర్భంగా అమెరికా వ్యాప్తంగా అధికారికంగా సెలవు ఉంటుంది. ఇపుడు దీపావళికి ఫెడరల్ హాలీడేగా ప్రకటిస్తే 12వ ఫెడరల్ హాలీడేగా నిలవనుంది.
Also Read..
IIFA 2023 | విక్కీని పక్కకు నెట్టేసిన సల్మాన్ బాడీగార్డ్స్.. వీడియో వైరల్
Cannes 2023 | కేన్స్‌లో అనుష్క మెరుపులు.. పిక్స్ వైరల్
Delhi Rains | ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

