KKR vs LSG : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో బోణీ కోసం నిరీక్షిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)కు మరో షాక్ తగిలేలా ఉంది. సొంత మైదానంలో విజయంతో మురవాలని ఆశ పడుతున్న కోల్‌కతాను వరుణుడు వెంటాడుతున్నాడు. ఇప్పటికే పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సాగనీయని వరుణుడు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)తో ఆటకు అంతరాయం కలిగించేలా ఉన్నాడు. వాతావరణ శాఖ సూచన ప్రకారం మ్యాచ్ మధ్యలో వాన అందుకోనుంది. దాంతో.. భారీ తేడాతో గెలిచి రెండు పాయింట్లతో పాటు మెరుగైన రన్‌రేటు సాధించాలని భావిస్తున్న కోల్‌కతా మరోసారి పాయింట్ పంచుకోవాల్సి రావచ్చు.
పంతొమ్మిదో సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ పాలిట వర్షం విలన్లా మారుతోంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కు అడ్డుపడిన వరుణుడు గురువారం కూడా కోల్‌కతాకు షాకిచ్చేలా ఉన్నాడు. గురువారం ఉదయం కోల్‌కతాలో భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడే అవకాశమున్నందున వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
🚨 KKR VS LSG MATCH UPDATE 🚨
– The KKR vs Punjab match at Eden Gardens in Kolkata has already been washed out due to rain.
– Today as well, a similar forecast is in place, with a high chance of heavy rain in Kolkata. Like the previous day, there is a strong possibility that… pic.twitter.com/2lSlEPHrOi
— lndian Sports Netwrk (@IS_Netwrk29) April 9, 2026
అయితే.. సాయంత్రం మబ్బులు తొలగినా ఎప్పుడు వాన పడుతుందోనని కోల్‌కతా ఆటగాళ్లను ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికల్లా పిచ్, ఔట్‌ఫీల్డ్ తడవకుండా చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉదయం వర్షం పడినందున రాత్రిపూట తేమ ఉండే అవకాశమున్నందున పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
మినీ వేలంలో రికార్డు ధర పలికిన కామెరూన్ గ్రీన్ వైఫల్యం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వేధిస్తోంది. మూడు మ్యాచుల్లో తేలిపోయిన గ్రీన్.. లక్నోపై చెలరేగాలని యాజమాన్యం భావిస్తోంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి లక్నోతో ఆడుతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఆరంభ మ్యాచ్‌లో 220 కొట్టినా ముంబై ఇండియన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడింది కోల్‌కతా.
GOOD NEWS FOR KKR 🚨🔥
Cameron Green likely to START BOWLING vs LSG 👀⚡
Big boost incoming 💯
All-round firepower getting unlocked 😈If Green bowls…
KKR just became twice as dangerous 💀Comeback loading 👑#CameronGreen #KKR #LSG #IPL #KKRvsLSG pic.twitter.com/tXnKQaquvm
— ND Sport (@SportsByND) April 8, 2026
సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల విజృంభణతో 161 పరుగులకే ఆలౌటైన కేకేర్ రెండో ఓటమి చవి చూసింది. మూడో మ్యాచ్ వర్షార్పణం కావడంతో పంజాబ్ కింగ్స్‌తో పాటు ఒక పాయింట్ పంచుకుంది అజింక్యా రహానే జట్టు. లక్నో సూపర్ జెయింట్స్ విషయానికొస్తే.. తొలి పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో కంగుతిన్నది. కానీ, ఉప్పల్ స్టేడియంలో కెప్టెన్ రిషభ్ పంత్ అర్ధ శతకంతో మెరవగా.. ఉత్కంఠ పోరులో ఎస్ఆర్హెచ్పై గెలిచి ఖాతా తెరిచింది.