Rahul Tripathi | టీ20ల్లో రాహుల్ త్రిపాఠి ఆరంగ్రేటం.. ఫొటోలు షేర్ చేసిన బీసీసీఐ
బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నుంచి డెబ్యూ క్యాప్ అందుకున్న రాహుల్
Rahul Tripathi : జాతీయ జట్టుకు ఆడాలన్న రాహుల్ త్రిపాఠి కల నిజమైంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో అతను ఆరంగ్రేటం చేశాడు. మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నుంచి అతను డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. రాహుల్ త్రిపాఠి కల నిజమైన వేళ అంటూ క్యాప్షన్ పెట్టింది. టీ20 భారత జట్టుకు ఆడుతున్న 102వ ఆటగాడిగా రాహుల్ గుర్తింపు సాధించాడు. ఐపీఎల్లో నిలకడగా ఆడిన రాహుల్ పోయిన ఏడాదే టీమిండియా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. కానీ, బెంచ్‌కే పరిమితం అయ్యాడు.
ఐపీఎల్లో 2018,19 సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన రాహుల్ ఆశించినంతగా రాణించలేదు. కోల్‌కతా నైట్ రౌడర్స్ 2020వ వేలంలో అతడిని కొనుగోలు చేసింది. ఆ ఫ్రాంఛైజీ తరఫున ఓపెనర్‌గా రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడాడు. పోయిన ఏడాది వేలంలో అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. మూడోస్థానంలో బ్యాటింగ్ వచ్చి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొత్తం 14 మ్యాచుల్లో158.24 స్ట్రైక్ రేటుతో 413 రన్స్ చేశాడు.
📸📸 Dream come true moment for @tripathirahul52 🙌🙌#TeamIndia #INDvSL @mastercardindia pic.twitter.com/igiWnQEEIR
— BCCI (@BCCI) January 5, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

