Rahul Dravid | మా అబ్బాయికి కోచింగ్ ఇవ్వలే.. ఎందుకో తెలుసా..?
Rahul Dravid : భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కుమారుడు సుమిత్ ద్రవిడ్ (Sumit Dravid) తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. జూనియర్ స్థాయిలో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. దాంతో, 'ఏముంది.. నాన్న దగ్గర కోచింగ్ తీసుకొని...
Rahul Dravid : భారత జట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) కుమారుడు సుమిత్ ద్రవిడ్ (Sumit Dravid) తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. జూనియర్ స్థాయిలో రాణిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. దాంతో, ‘ఏముంది.. నాన్న దగ్గర కోచింగ్ తీసుకొని ఉంటాడు. అందుకనే అదరగొడుతున్నాడు’ అని చాలామంది అనుకోవడం ద్రవిడ్ చెవిన పడింది. ఈ విషయంపై అతడు తాజాగా స్పందించాడు.
జియోసినిమా ఇంటర్వ్యూలో మాట్లాడిన ద్రవిడ్ .. తన కుమారుడికి కోచింగ్ ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పాడు. ‘మావాడికి నేను కోచింగ్ ఇచ్చానని అందరూ అనుకుంటారు. కానీ నేను ఎప్పుడూ సుమిత్‌కు కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే.. ఒకే సమయంలో తండ్రిగా, కోచ్‌గా ఉండడం సవాల్‌తో కూడినది. అందుకనే నేను మా అబ్బాయితో ఒక పేరెంట్‌గానే ఉంటాను’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
రాహుల్ ద్రవిడ్, సుమిత్ ద్రవిడ్

మిస్డర్ డిపెండబుల్ ట్యాగ్‌తో ద్రవిడ్ భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్‌గా అవతారమెత్తాడు. ఇక తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సుమిత్ కర్నాటక తరఫున అండర్ 19 టోర్నీల్లో చెలరేగి ఆడుతున్నాడు. ఈ మధ్యే ద్రవిడ్, భార్య విజితాతో కలిసి సుమిత్ ఆటను ఆస్వాదించిన విషయం తెలిసిందే.

రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌గా పగ్గాలు అందుకున్న ద్రవిడ్ అనతికాలంలోనే తనముద్ర వేశాడు. టీమిండియాను రెండు ఐసీసీ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. కానీ, ఆఖరి మెట్టుపై తడబడిన రోహిత్ సేన కోట్లాది మందిని కన్నీటిసంద్రంలో ముంచేసింది. లెక్క ప్రకారం ప్రపంచ కప్‌తో ద్రవిడ్ బృందం పదవీ కాలం ముగిసింది. అయితే.. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉన్నందున బీసీసీఐ ద్రవిడ్ బృందంపై నమ్మకం ఉంచుతూ.. కోచింగ్ కాలాన్ని పొడిగించింది.
ఇవి కూడా చదవండి
- Choutuppal | చౌటుప్పల్‌లో భారీగా ట్రాఫిక్ జామ్.. 3 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- RaghuThatha | నాకు హిందీ రాదు అంటున్న కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘రఘు తాత’ టీజర్
- Sachin Tendulkar | అసాధ్యాన్ని చేసి చూపించావ్.. నువ్వొక స్ఫూర్తి ప్రదాత.. దివ్యాంగ క్రికెటర్‌పై సచిన్ ప్రశంసలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

