RaghuThatha | నాకు హిందీ రాదు అంటున్న కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘రఘు తాత’ టీజర్
Keerthy Suresh | సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళ సినిమాలు చేస్తూ ఉంది.
Keerthy Suresh | సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నేను శైలజతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళ సినిమాలు చేస్తూ ఉంది. ఇప్పటికే జయం రవితో సైరెన్ మూవీ చేస్తున్న తాజాగా ‘రఘు తాతా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సుమన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి రీసెంట్గా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో క్యాడెట్ శిక్షణ పొందుతున్న కీర్తి సురేష్ పాత్రతో టీజర్ ప్రారంభమవుతుంది. అయితే NCC మాస్టర్ హిందీలో శిక్షణ ఇస్తుండగా.. నాకు హిందీ రాదు తమిళంలో చెప్పండి సార్ అంటూ కీర్తి సురేష్ చెబుతుంది. దీంతో ఈ చిత్రం తమిళ ప్రజలపై హిందీని రుద్దడం చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక సన్నివేశంలో హిందీ పరీక్ష రాస్తేనే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అంటే దానిని కీర్తి సురేష్ తిరస్కరించడం చూడవచ్చు.
‘సలార్’ తో సక్సెస్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, రాజీవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షాన్ రోల్డన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arrest | నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

