Rafeal Nadal | అప్పటివరకూ వేచి ఉండండి.. రీ-ఎంట్రీపై నాదల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) రాకెట్ పట్టి ఆరు నెలలపైనే అయింది. భుజం గాయంతో ఈ ఏడాది పలు టోర్నీలకు దూరమైన ఈ స్టార్ ఆటగాడు ఎప్పుడు బరిలోకి దిగుతాడు? అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ డైరెక్టర్ క్రెగ్ టిలే(Craig Tiley) నాదల్...
Rafeal Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్(Rafeal Nadal) రాకెట్ పట్టి ఆరు నెలలపైనే అయింది. భుజం గాయంతో ఈ ఏడాది పలు టోర్నీలకు దూరమైన ఈ స్టార్ ఆటగాడు ఎప్పుడు బరిలోకి దిగుతాడు? అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ డైరెక్టర్ క్రెగ్ టిలే(Craig Tiley) నాదల్ రీ-ఎంట్రీ గురించి తాజాగా ఓ పెస్టు పెట్టాడు.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాదల్ పోటీపడతాడని క్రెగ్ అందులో చెప్పాడు. దానికి కౌంటర్‌గా నాదల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ‘నేను మళ్లీ రాకెట్ పడతానని నిన్ననే చెప్పాను. నేను నిర్ణయించుకొని నా టీమ్‌తో కలిసి ఎప్పుడు, ఎక్కడ ప్రకటన చేస్తానో అప్పటివరకూ వేచి ఉండండి’ అని నాదల్ క్యాప్షన్ రాశాడు.
పురుషుల టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టించిన నాదల్ అనతికాలంలోనే నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు రోజర్ ఫెదరర్ రారాజుగా వెలుగొందుతున్న సమయంలో నాదల్ అతడికి ప్రధాన పోటీదారుడుగా మారాడు. వరుస టోర్నీల్లో అతడికి షాకిస్తూ నయా చాంపియన్‌గా అవతరించాడు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఓపెన్‌లో మకుటం లేని మహారాజుగా పేరొందాడు. అంతేకాదు ఈ స్పెయిన్ బుల్ 22 గ్రాండ్‌స్లామ్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించాడు.
నాదల్, రోజర్ ఫెదరర్

అయితే.. మోకాలు, భుజం గాయాలతో రఫా వెనకబడడంతో.. జకోవిచ్ దూసుకొచ్చాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి 23 గ్రాండ్‌స్లామ్స్‌తో నాదల్ రికార్డును బద్ధలు కొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో భుజం గాయంతో బాధపడిన నాదల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తన రీ ఎంట్రీపై పత్రికల్లో, సోషల్‌మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు వచ్చినప్పుడల్లా నాదల్ స్పందిస్తూనే ఉన్నాడు. తాను కోర్టులో అడుగుపెట్టేది ఎప్పుడో తానే స్వయంగా వెల్లడిస్తానని గాలి వార్తలకు చెక్ పెడుతున్నాడు.
ఇవి కూడా చదవండి
-
Hi Nanna | రాజకీయ నాయకుడిగా మారిన హీరో నాని.. ఎందుకంటే.?
-
INDvsAUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో టాస్ గెలవాలంటే రోహిత్ ఇలా చేయాలి..! పాక్ మాజీ ఆటగాడిని ట్రోల్ చేసిన జాఫర్
-
Great Khali | రెండోసారి తండ్రైన గ్రేట్ ఖలీ.. వెల్లువెత్తుతున్న అభినందనలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

